వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

30 జిల్లాల్లో ఏడు మనవే.. నవరత్నాలు ఎందుకు, మారెడ్డి అంటూ రఘురామ చిందులు

|
Google Oneindia TeluguNews

జగన్ సర్కార్‌పై రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు మరోసారి ఫైరయ్యారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా వివిధ అంశాలపై సునిశీత విమర్శలు చేశారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు/ ఇతర అంశాలను ఆయన ప్రస్తావించారు. తన 18 నిమిషాల వీడియోలో ప్రభుత్వ వైఖరి గురించి తప్పుపట్టారు. దేవినేని ఉమా, దూళిపాళ్ల నరేంద్ర కేసులు వేధింపులేనని చెప్పారు.

చీమ కుట్టినట్లయినా లేదు..

చీమ కుట్టినట్లయినా లేదు..


కరోనా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని చెప్పారు. వైరస్ విషయంలో ప్రభుత్వం తీరు దున్నపోతు మీద వాన పడ్డట్టు ఉంది అని చెప్పారు. చేతగానీ వారు, సన్నాసులు అధికారంలో ఉంటే ఇదే జరుగుతుందని విమర్శలు గుప్పించారు. కరోనా గురించి సొంత పార్టీ నేతలే కామెంట్ చేస్తున్నారని రఘురామ గుర్తుచేశారు. వీడియోల గురించి ప్రస్తావించి.. ప్రభుత్వాన్ని ఎండగట్టారు.

7 జిల్లాలు ఏపీవే..

7 జిల్లాలు ఏపీవే..


దేశంలో కరోనా విలయ తాండవం చేస్తుందని రఘురామ తెలిపారు. 30 జిల్లాలు అతి ప్రమాదకరంగా మారాయని తెలిపారు. అయితే అందులో ఏపీకి చెందిన 7 జిల్లాలు ఉన్నాయని వివరించారు. వారెవా జగన్ అంటూ విరుచుకుపడ్డారు. దేవినేని ఉమా, టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను బట్టి జగన్ సీఎం కాదు.. ప్రధాని కావాలని అన్నారు.

నవరత్నాలు ఎందుకు రెడ్డి..

నవరత్నాలు ఎందుకు రెడ్డి..


రాజధాని మీద కుయుక్తులు పన్నారని రఘురామ ఫైరయ్యారు. కరోనాతో రాష్ట్రం అల్లాడుతోందని చెప్పారు. అలాంటి సమయంలో నవరత్నాలు అని మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది అని చెప్పారు. నవ నాడులు, నవ రంధ్రాల ద్వారా జనం ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని వివరించారు. అలాంటి పరిస్థితుల్లో ఉంటే నవరత్నాలు అని టైం పాస్ చేయడం సరికాదని వివరించారు.

Recommended Video

Ys Jagan సర్కారుకి హైకోర్టు సూచన, లోపాలు ఉన్నాయ్ చూస్కోండి
ముమ్మాటికీ వేధింపులే

ముమ్మాటికీ వేధింపులే


దూళిపాళ్ల నరేంద్రకు సంబంధించి వేధింపులేనని రఘురామ మరోసారి స్పష్టంచేశారు. ఈ కేసు ఏసీబీకి సంబంధం లేదు అని తేల్చిచెప్పారు. కానీ కావాలనే హరాస్ చేయడం ఎంతమాత్రం తగదని చెప్పారు. వైజాగ్ బీచ్ కారిడార్ కోసం క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంపై రఘురామ స్పందించారు.

English summary
ysrcp mp raghu rama krishna raju slams cm ys jagan mohan reddy on corona virus spread other issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X