కేంద్రం వద్ద మూలుగుతున్న ఏపీ బకాయిలు: ఆ ఒక్క జాతీయ పథకం కిందే 4,976 కోట్లు: మినీ యుద్ధం

అమరావతి: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న జాతీయ పథకాలకు సంబంధించిన నిధుల బకాయిల విడుదల కోసం జగన్ సర్కార్ ఓ మినీ యుద్ధాన్నే చేయాల్సి వస్తోంది. ఆయా పథకాలకు కేంద్ర ప్రభుత్వం అడ్వాన్స్‌గా నిధులను విడుదల చేసే పరిస్థితి కనిపించట్లేదు. కనీసం బిల్లులను అందజేసిన తరువాత కూడా వాటి ఊసే ఎత్తట్లేదు మోడీ సర్కార్. అసలే ఆర్థికంగా తీవ్ర లోటు, ఇబ్బందులను ఎదుర్కొంటోన్న జగన్ సర్కార్‌కు.. ఈ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని పథకాలను రాష్ట్ర నిధులతో నడిపించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. బకాయిల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితిని ఎదుర్కొంటోంది.

ఉపాధి హామీ పథకం కింద..

ఉపాధి హామీ పథకం కింద..

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హమీ పథకం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినది. ఇదివరకు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద గ్రామీణులకు ఉపాధిని కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. దీనికి అయ్యే చెల్లింపులను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు విడుదల చేస్తుంటుంది. కొంతకాలంగా ఈ పనులకు సంబంధించిన నిధులు విడుదల కావట్లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ పరిస్థితి ఏపీకి మాత్రమే పరిమితం కాలేదని, పలు రాష్ట్రాలకు చెందిన జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను కేంద్రం విడుదల చేయట్లేదంటూ ఇదివరకు వార్తలొచ్చాయి.

 రాష్ట్రానికి రావాల్సిన బకాయిలివే..

రాష్ట్రానికి రావాల్సిన బకాయిలివే..

ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రావాల్సిన నిధుల బకాయిల అంచనా విలువ 4,976 కోట్ల రూపాయలు. ఇందులో మెటీరియల్ కాంపొనెంట్ 76 శాతం. ఏపీకి మెటీరియల్ కాంపొనెంట్ కింద విడుదల చేయాల్సిన బకాయిల మొత్తం 1,341 కోట్ల రూపాయలు మాత్రమేనంటూ కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ స్పష్టం చేశారు. రాజ్యసభలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూరకంగా సమాధానం ఇచ్చారు.

 ప్రశ్నించిన సాయిరెడ్డి..

ప్రశ్నించిన సాయిరెడ్డి..

ఈ విషయాన్ని విజయసాయి రెడ్డి ఈ ఉదయం రాజ్యసభలో ప్రస్తావించారు. ఇన్ని కోట్ల రూపాయల బకాయిలను ఎందుకు విడుదల చేయట్లేదని ప్రశ్నించారు. మెటీరియల్ కాంపొనెంట్‌ అంచనాను ఎందుకు తగ్గించాల్సి వచ్చిందో వివరించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు, బిల్లులను అందజేసిన తరువాత కూడా నిధులను ఎందుకు విడుదల చేయట్లేదని, దీనికి కారణాలను వెల్లడించాలని అన్నారు. ఈ నిధులను ఎప్పుడు విడుదల చేస్తారో తెలియజేయాలని చెప్పారు.

పరిశీలించాల్సి ఉందంటూ

పరిశీలించాల్సి ఉందంటూ

దీనిపై గిరిరాజ్ సింగ్ మాట్లాడారు. కార్మికులకు చెల్లించాల్సిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా బకాయి లేదని తేల్చి చెప్పారు. మెటిరీయల్ కాంపొనెంట్‌కు సంబంధించిన బకాయిలను విడుదల చేయడానికి సోషల్ ఆడిట్ వంటి పలు రకాల నిబంధనలను పరిశీలించాల్సి ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన వివరాలు, తమ వద్ద ఉన్న సమాచారం అస్పష్టంగా ఉందని, సాంకేతిక లోపాలు ఉన్నాయని, దాన్ని బేరీజు వేసుకోవాల్సి ఉందని చెప్పారు. బ్యాలెన్స్ షీట్‌ను పరిశీలించాల్సి ఉందని స్పష్టం చేశారు.

గందరగోళం మధ్యే..

గందరగోళం మధ్యే..

దీనిపై విజయసాయి రెడ్డి మాట్లాడుతూ కేంద్రం నుంచి నిధులు మంజూరు కాకున్నా, కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి ఆటంకం కలిగించలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులను దీనికోసం ఖర్చు చేశామని అన్నారు. ఈ ఇద్దరి మధ్య ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్న సమయంలో రాజ్యసభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. వేర్వేరు పార్టీలకు చెందిన 12 మంది సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తేయాలంటూ సభ్యులు డిమాండ్ చేశారు. నినాదాలతో హోరెత్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+