Zee News-Matrize exit polls: బీజేపీ ఖాతాలో నాగాలాండ్, త్రిపుర! మేఘాలయలో హంగ్

జీ న్యూస్-మ్యాట్రైజ్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. త్రిపుర అసెంబ్లీ:బీజేపీ 29-36 స్థానాల్లో విజయం సాధిస్తుంది. వామపక్ష కూటమికి 13-21 స్థానాలు దక్కే అవకాశం ఉంది.

న్యూఢిల్లీ: మూడు ఈశాన్య రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో పార్టీల మధ్య హోురాహోరీగా పోరు జరిగినట్లు తెలుస్తోంది. త్రిపురలో మాత్రం బీజేపీ హవా కొనసాగినట్లు తెలుస్తోంది.

జీ న్యూస్-మ్యాట్రైజ్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం..
త్రిపుర అసెంబ్లీ:
బీజేపీ 29-36 స్థానాల్లో విజయం సాధిస్తుంది.
వామపక్ష కూటమికి 13-21 స్థానాలు దక్కే అవకాశం ఉంది.

Zee News-Matrize exit polls of Tripura, Meghalaya and Nagaland

నాగాలాండ్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్ పలితాలు:
బీజేపీ 35-43 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది.
ఎన్సీఎఫ్ 2-5 స్థానాలు దక్కించుకునే ఛాన్స్ ఉంది.
కాంగ్రెస్ పార్టీకి 1-3 సీట్లు వచ్చే అవకాశం ఉంది.
ఎన్సీపీకి 0-1
ఇతరులకు 6-11 స్థానాలు దక్కే అవకావం ఉంది.

మేఘాలయా అసెంబ్లీ ఎగ్జిట్ ఫలితాలు:
ఎన్పీపీ 21-26 స్థానాల్లో గెలిచే అవకాశం
టీఎంసీకి 8-13 సీట్లు వచ్చే అవకాశం
బీజేపీకి 6-11 సీట్లు దక్కే అవకాశం
కాంగ్రెస్ పార్టీ 3-6 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది
ఇతరులు: 10-19 స్థానాలు వచ్చే అవకాశం ఉంది.

ఏ పార్టీకి మేఘాలయలో మెజార్టీ రాకపోవడంతో ఇక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉంది. వివిధ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్సు ఉంది.

యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. త్రిపుర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 36-45 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఇక వామపక్షాల కూటమికి 6-11 సీట్లు దక్కే అవకాశం ఉంది. టీఎంసీకి 9-16 స్థానాల్లో గెలుచుకుంటుందని పేర్కొంది.

మొత్తం 60 స్థానాలున్న త్రిపుర అసెంబ్లీలో 31 స్థానాలు దక్కించుకున్న పార్టీ అధికారంలోకి వస్తుంది. అంటే బీజేపీకి 36-45 సీట్లు వచ్చే అవకాశం ఉండటంతో మరోసారి త్రిపురలో బీజేపీనే అధికార పగ్గాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+