భారత్ లో జెలెన్ స్కీ టీ- మనోళ్ల వాడకమా ? మజాకా ?-రష్యాపై పరాక్రమాన్ని గుర్తుచేస్తూ..
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రకు ముందు జెలెన్ స్కీ పేరు ప్రపంచవ్యావ్తంగా ఎవరికీ పెద్దగా తెలియదు. కేవలం ఐరోపా దేశాలతో పాటు ఉక్రెయిన్ చుట్టు పక్కల దేశాలకు మాత్రమే తెలుసు. అంతెందుకు రష్యా అధినేత పుతిన్ సైతం జెలెన్ స్కీని చాలా తక్కువ అంచనా వేశారు. జెలెన్స్కీ ఆధ్వర్యంలోని ఉక్రెయిన్ ను చాలా సులువుగా స్వాధీనం చేసుకోవచ్చని కలలు కన్నారు. వాటిని కల్లలు చేస్తూ జెలెన్ స్కీ అనూహ్య ప్రతిఘటనతో ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాలకు ఆయన సుపరిచుడైపోయారు.
A new Assam tea blend called Zelenskyy, Really Strong has been released by startup @AromicaTea This shows how globally people are appreciating the exceptional courage & valour of President @ZelenskyyUa of #Ukraine️ #UkraineWar #UkraineRussiaWar pic.twitter.com/JHrA4QYenI
— Joydeep Phukan (@joyphukan) March 16, 2022
రష్యాతో పోరులో మహేంద్ర బాహుబలి తరహాలో స్ధానికుల్ని పోగేసి జెలెన్ స్కీ చూపుతున్న పరాక్రమంతో ఇప్పుడు ఆయన పేరు భారత్ లోనూ మార్మోగిపోతోంది. సరిగ్గా దీన్ని సొమ్ము చేసుకునేందుకుప కార్పోరేట్ కంపెనీలు రంగంలోకి దిగాయి. అస్సోంకు చెందిన తేయాకు పౌడర్ తయారీ సంస్ధ అరోమికా టీ ఇప్పుడు జెలెన్ స్కీ పేరుతో తాజాగా కొత్త టీ బ్రాండ్ ను విడుదల చేసింది. రియల్లీ స్ట్రాంగ్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టేసింది. జెలెన్ స్కీ బ్లాక్ టీను మార్కెట్లోకి విడుదల చేసేసింది. దీంతో ఇప్పుడు ఈ టీ గురించి కూడా ప్రచారం పెరుగుతోంది.

అరోమికా టీ కంపెనీ తయారు చేసిన జెలెన్ స్కీ బ్లాక్ టీ ఇఫ్పుడు నెట్లోనూ హల్ చల్ చేస్తోంది. ఈ టీ ప్యాకెట్ ఫొటోలు తీసి కొందరు అభిమానులు ట్విట్టర్ లో పెడుతున్నారు. దీంతో ఈ ట్వీట్లకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ఉక్రెయిన్ పోరు తర్వాత జెలెన్ స్కీకి పెరుగుతున్న ఆదరణ చూస్తుంటే భారత్ లో త్వరలో మరిన్ని బ్రాండ్లకు ఆయన పేరు పెట్టేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైనా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను భారతీయ కంపెనీలు మరోసారి వాడుకుంటున్న తీరు ప్రపంచదేశాల్ని ఆశ్చర్యపరుస్తోంది.












Click it and Unblock the Notifications