వధువు కాదు.. 'మిలియన్ డాలర్ బ్రైడ్' బొమ్మ: ఖరీదు పది లక్షల డాలర్లు

Posted By:
Subscribe to Oneindia Telugu

దుబాయ్: అరబిక్ సంప్రదాయ పెళ్లి కూతురులా అందంగా ముస్తాబు చేసినట్లుగా ఉన్న ఓ కేకును తయారు చేయడానికి పది లక్షల డాలర్లు ఖర్చయింది. ఇందులో విలువైన వజ్రాలు పొదిగారు. ఒక్కో వజ్రం ఖరీదు రూ.2 లక్షల డాలర్లు.

అందుకే దీనిని మిలియన్ డాలర్ బ్రైడ్‌గా పిలుస్తున్నారు. లండన్‌కు చెందిన డెబ్బీ వింగ్ హామ్ అనే డిజైనర్ ఈ అందమైన బొమ్మను తయారు చేశారు. దుబాయ్‌లో జరిగిన బ్రైడ్ షోలో దీనిని ప్రదర్శించారు.

 $1 Million 'bride' wedding cake unveiled at exhibition in Dubai

ఈ కేకు 6 అడుగులు ఎత్తు, 120 కిలోలు ఉంది. కేకుపై డెకరేషన్‌కు ఉపయోగించే పేస్ట్50 కిలోలు. ముఖం, శరీర పైభాగం, చేతులు, చేతివేళ్లు తయారు చేయడం కోసం 25 కిలోల చాక్లెట్‌‌ను ఉపయోగించారు. ఈ బొమ్మ కోసం ఉపయోగించిన కేకును దుబాయిలోని ప్రఖ్యాత హోటల్‌లో తొలుత బేక్‌ చేసి తీసుకొచ్చారు.

ఆ తర్వాత కేకును ఫాండాంట్‌, చాక్లెట్‌ సహాయంతో అచ్చం పెళ్లి కూతురులా తయారు చేశారు. దీనిని తయారు చేసేందుకు అయిదు రోజులు పట్టింది. ఇది కేకు అంటే మొదట ఎవరూ నమ్మలేదు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It took five days and more than 1,000 eggs to put together a $1 million cake that was put on display at an exhibition in Dubai.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి