పాకిస్తాన్‌లో కోర్టు వద్ద దాడి: జడ్జి సహా 11మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో ముష్కరులు మరోసారి రెచ్చిపోయారు. ఇస్లామాబాద్‌లోని ఓ న్యాయస్థానం ఆవరణలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో పదకొండు మంది మృతి చెందారు. మృతి చెందిన వారిలో న్యాయమూర్తి కూడా ఉన్నారు. దాదాపు ఇరవై మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.
పలువురు వ్యక్తులు ఇస్లామాబాద్‌లోని కోర్టు కాంప్లెక్సు పైన దాడి చేశారని, ఈ ఘటనలో పదకొండు మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారని పాకిస్తాన్ అధికారులు చెబుతున్నారు.

పలువురు వ్యక్తులు కోర్టు కాంప్లెక్సులోకి వచ్చారని, జడ్జి చాంబర్, న్యాయవాదులు ఉండే చోటకు వచ్చి దారుణానికి పాల్పడ్డారని పోలీసు అధికారి నబీ అస్వాన్ చెప్పారు. ముష్కరులు గ్రెనేడ్స్ కూడా విసిరారని చెప్పారు.
గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ఇస్లామాబాద్ ప్రధాన ఆసుపత్రి అధికార ప్రతినిధి డాక్టర్ అయిషా ఇసానీ మృతి, గాయాలైన వారి విషయమై పోలీసులు అధికారుల వ్యాఖ్యలను ధృవీకరించారు.
పాకిస్తాన్ టెలివిజన్ ఛానళ్లలో విరిగిపోయిన కిటికీలు, కూలిన గోడలను చూపించారు. పలువురు న్యాయవాదులు చనిపోయిన వారిని, గాయపడ్డ వారిని లోపలి నుండి బయటకు తీసుకు వస్తున్నారు. సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.












Click it and Unblock the Notifications