వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్కార్ రేసులో చూడదగ్గ 15 సినిమాలు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఒలీవియా కోల్‌మన్

కోవిడ్ ప్రస్తావన తేకుండా సినిమాల గురించి మాట్లాడటం కష్టం. ఈ మహమ్మారి సినిమా మీద, ప్రేక్షకుల మీద మాత్రమే కాకుండా సినిమాల విడుదలపై కూడా తీవ్రమైన ప్రభావం చూపించింది.

ఏది ఏమైనప్పటికీ, సినిమా అవార్డుల పరంపర కొనసాగాల్సిందే. ఈ ఏడాది ఆస్కార్‌కు పోటీ పడేందుకు కొన్ని వైవిధ్యమైన చలన చిత్రాలు కూడా ఉన్నాయి.

మార్చి నెల చివర్లో చోటు చేసుకోబోయే ఆస్కార్ అవార్డులకు ముందు దృష్టి సారించాల్సిన 15 సినిమాలివే.

1. బెల్‌ఫాస్ట్

బెల్‌ఫాస్ట్

కథ ఏంటి? బెల్‌ఫాస్ట్‌లో ఒక యువకుడు పెరిగిన తీరును వివరించే కథ. సర్ కెన్నెత్ బ్రానాగ్ దర్శకత్వం వహించారు.

ఎవరు నటించారు? జ్యూడ్ హిల్, జేమీ డోర్నన్, సియారన్ హిండ్స్, కైట్ రియోనా బాల్ఫ్.

ఆస్కార్ అవకాశమెంత: ఉత్తమ సినిమా, దర్శకత్వం, స్క్రీన్ ప్లే, నటుల నామినేషన్ విషయంలో బలంగా ఉంది. వ్యాన్ మోరిసన్ సంగీతం అందించిన డౌన్ టూ జాయ్ కూడా ఉత్తమ పాటగా ఉంది.

ఈ సినిమాకు నామినేషన్ లభిస్తే, కెన్నెత్ కెరీర్ మొత్తం మీద ఏడు విభిన్న విభాగాలలో నామినేట్ అయిన తొలి వ్యక్తిగా నిలుస్తారు. ఇప్పటికే ఆయన దర్శకుడు, నటుడు, సహనటుడు, స్క్రీన్ ప్లే, లైవ్ యాక్షన్ కు నామినేట్ అయ్యారు. బెల్‌ఫాస్ట్‌కు గనక ఉత్తమ సినిమా, లేదా ఒరిజినల్ స్క్రీన్ ప్లే నామినేషన్ వస్తే ఆయన కొత్త రికార్డును సృష్టించిన వారవుతారు. వాల్ట్ డిస్నీ నామినేషన్ సమయంలో ఆస్కార్ నియమాలు వేరు.

ఈ సినిమా ఫిబ్రవరి 22న విడుదల అవుతుంది.

2. వెస్ట్‌సైడ్ స్టోరీ

వెస్ట్‌సైడ్ స్టోరీ

కథ ఏంటి? - ఈ సినిమా న్యూ యార్క్‌లో వీధి గ్యాంగుల మధ్య జరిగే పోరాటం గురించి తీసిన స్టీవెన్ స్పీల్‌‌బర్గ్ కొత్త వెర్షన్. ఇందులో టోనీ, మరియా ప్రేమ కథ కూడా ఉంటుంది.

ఇందులో ఎవరున్నారు? రేచెల్ జెగ్లెర్, ఆన్సెల్ ఎల్‌గోర్ట్

ఆస్కార్ అవకాశమెంత: ఇది ఉత్తమ సినిమా, దర్శకత్వం విభాగాలలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యే అవకాశముంది. రేచెల్ జెగ్లెర్ ఉత్తమ నటిగా నామినేట్ అవ్వవచ్చు. 1961లో తీసిన ఒరిజినల్ సినిమాలో ఉత్తమ సహాయ నటి అవార్డును గెలుచుకున్న 90 సంవత్సరాల రీటా మొరెనో మరో సారి ఆ అవార్డును గెలుచుకునే అవకాశముంది. ఈ సారి ఆమె కొత్తగా వాలెంటినా పాత్రను పోషించారు.

ఈ సినిమా ఇప్పటికే విడుదల అయింది.

3. ది పవర్ ఆఫ్ ది డాగ్

బెనెడిక్ట్ కంబర్‌బ్యాచ్

కథ - ఒక పశువుల కాపరి కొత్తగా పెళ్లి చేసుకున్న తన సోదరుడి భార్యను, ఆమె కొడుకును క్రూరంగా వేదనకు గురి చేసిన కథ.

ఎవరు నటించారు? బెనెడిక్ట్ కంబర్‌బ్యాచ్, కిర్‌స్టన్ డన్స్ట్ , జెస్సీ ప్లేమన్స్ , కోడి స్మిట్ మెక్‌ఫీ

ఆస్కార్ అవకాశమెంత: ఈ ఏడాదిలో ఈ సినిమాకు అత్యుత్తమ రివ్యూలు లభించాయి. ఇది ఉత్తమ సినిమాగా, యాక్టింగ్ విభాగంలో స్క్రీన్ ప్లే కు నామినేట్ అయ్యేందుకు అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఉత్తమ డైరెక్టర్ విభాగంలో ఏడుగురు మహిళలు నామినేట్ అయ్యారు. కానీ, ఈ సినిమా నామినేట్ అయితే, దర్శకురాలు జేన్ కాంపియన్ రెండు సార్లు నామినేట్ అయిన మహిళగా నిలుస్తారు. ఆమె 1993లో ది పియానోకు తొలి సారి నామినేట్ అయ్యారు.

ఇది ఈ ఏడాది నవంబరులో విడుదల అయింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో లభిస్తోంది.

4. లికోరీస్ పిజ్జా

లికోరీస్ పిజ్జా

కథ - 1970లలో కాలిఫోర్నియాలో సాన్ ఫెర్నాండో వ్యాలీలో చిగురించిన తొలి ప్రేమ కథ

ఎవరున్నారు? అలానా హైం, కూపర్ హాఫ్ మ్యాన్, సీన్ పెన్, బ్రాడ్లీ కూపర్

ఆస్కార్ అవకాశమెంత: ఉత్తమ సినిమాగా నామినేట్ అయ్యేందుకు అవకాశముంది. పాల్ థామస్ ఆండెర్‌సన్‌కు ఉత్తమ దర్శకుడుగా, ఒరిజినల్ స్క్రీన్ ప్లేకు నామినేట్ అయ్యే అవకాశముంది. పాప్ రాక్ గ్రూప్‌లో అత్యంత పిన్న వయస్కురాలైన అలానా హైం ఉత్తమ నటి విభాగంలో నామినేట్ కావచ్చు.

జనవరి 01న విడుదల అవుతుంది.

5. కింగ్ రిచర్డ్

కింగ్ రిచర్డ్

కథేంటి: ఇది టెన్నిస్ క్రీడాకారులు సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్ తండ్రి, కోచ్ రిచర్డ్ విలియమ్స్, జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమా.

ఎవరు నటించారు? విల్ స్మిత్, ఆన్ జానూ ఎల్లిస్, సానియా సిడ్నీ

ఆస్కార్ అవకాశమెంత: విల్ స్మిత్ ఇప్పటి వరకు ఆస్కార్ గెలుచుకోలేదు. కానీ, గతంలో అలీ, ది పర్ సూట్ ఆఫ్ హ్యాపీనెస్‌కు రెండు సార్లు నామినేట్ అయ్యారు. ఈ సారి ఆయనను అదృష్టం వారించే అవకాశముంది. స్మిత్‌కు ఉత్తమ నటుడు వచ్చే అవకాశముందని చాలా మంది ఊహిస్తున్నారు. ఈ సినిమా ఉత్తమ సినిమాగా కూడా నామినేట్ కావచ్చు.

నవంబరులో విడుదలయింది.

6. డ్యూన్

డ్యూన్

కథ: ఫ్రాంక్ హెర్బర్ట్ రచించిన సైన్స్ ఫిక్షన్ నవల ఆధారంగా తీసిన సినిమా. ఒక జమీందారీ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి కొడుకు, నక్షత్రమండలంలో ఉన్న అత్యంత విలువైన పదార్ధాన్ని కాపాడేందుకు చేసే ప్రయత్నం.

ఎవరు నటించారు? టిమోతీ చలామెట్ , రెబెక్కా ఫెర్గ్యూసన్, జెన్ డాయా

ఆస్కార్ అవకాశమెంత: ఇది ఉత్తమ సినిమా, ఉత్తమ దర్శకత్వానికి నామినేట్ అయ్యే అవకాశముంది. నటులకు అవకాశం లేకపోవచ్చు. సాంకేతికంగా చాలా విభాగాల్లో నామినేట్ అయ్యే అవకాశమున్న సినిమా.

అక్టోబరులో విడుదల అయింది. ప్రీమియం వీడియోలో కూడా డిమాండు పై లభిస్తోంది.

7. టిక్ టిక్ బూమ్

టిక్ టిక్ బూమ్

కథ - 30 ఏళ్ళు వచ్చేసరికి ఒక థియేటర్ నటుడు తన జీవితాన్ని , భవిష్యత్తును పునర్ విశ్లేషించుకున్న కథ

ఎవరు నటించారు? ఆండ్రూ గార్‌ఫీల్డ్, అలెక్జాన్డ్రా షిప్

ఆస్కార్ అవకాశమెంత: గార్‌ఫీల్డ్ కు ఉత్తమ నటుని విభాగంలో నామినేట్ అవ్వచ్చు. ఉత్తమ సినిమాగా కూడా నామినేట్ అయ్యే అవకాశముంది. 2022లో ఈ సినిమాకు కనీసం 10 నామినేషన్లు ఉంటాయని భావిస్తున్నారు.

ఎక్కడ చూడవచ్చు? ఇది నవంబరులో విడుడలయింది. నెట్ ఫ్లిక్స్‌లో లభిస్తోంది.

8. హౌస్ ఆఫ్ గుక్కీ

కథ ఏంటి? - పట్రీషియా రెగ్గియాని వివాహం చేసుకుని శక్తివంతమైన గుక్కీ కుటుంబంలోకి వెళ్లిన వెంటనే, ఆమె ఆ బ్రాండ్ పై ప్రభావం చూపించాలని అనుకుంటుంది. అయితే, అస్తవ్యస్తంగా ఉన్న ఆ కుటుంబ సభ్యులు అప్పటికే బ్రాండును నియంత్రిస్తూ ఉంటారు.

ఎవరు నటించారు? లేడీ గగా, ఆడం డ్రైవర్, అల్ పాసినో, జారెడ్ లెటో , జెరెమీ ఐరన్స్

ఆస్కార్ అవకాశమెంత: లేడీ గగా కు ఉత్తమ నటి గా నామినేట్ అయ్యే అవకాశముంది. జారెడ్ లెటో కు ఉత్తమ సహాయ నటుడుగా నామినేషన్ ఉండవచ్చు. కానీ, ఉత్తమ సినిమా, దర్శకత్వం విభాగంలో నామినేట్ కాకపోవచ్చు.

నవంబరులో విడుదల అయింది.

9. స్పెన్సర్

క్రిస్టెన్ స్ట్యూయర్ట్

కథ ఏంటి? యువరాణి డయానా తన కుటుంబంతో కలిసి సాన్‌డ్రింగ్హం‌లో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడాన్ని చూపిస్తుంది. మరో వైపు ఆమె వివాహ బంధం పగుళ్లు వారుతూ ఉంటుంది.

ఎవరు నటించారు? క్రిస్టెన్ స్ట్యూయర్ట్ , స్యాలీ హాకిన్స్, టిమోతీ స్పాల్

ఆస్కార్ అవకాశమెంత: దీనిని అందరూ ఇష్టపడకపోవచ్చు. కానీ, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ పాత్రలో నటించిన క్రిస్టెన్‌కు అభినందనలు రావచ్చు. ఆమె ఉత్తమ నటి అందుకునే రేసులో ముందుండే అవకాశముంది. ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్ డిజైన్‌లో కూడా నామినేషన్లు ఉండవచ్చు.

నవంబరులో విడుదల అయింది.

10. ది లోస్ట్ డాటర్

కథ ఏంటి? - వేసవి సెలవులు గడుపుతున్న ఒక మహిళ మరొక మహిళ ఆమె కూతురితో వ్యామోహంలో పడుతుంది. దాంతో, ఆమె గతం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది.

ఎవరు నటించారు? ఒలీవియా కోల్‌మ్యాన్, జెస్సీ బక్‌లీ, డకోటా జాన్‌సన్

ఆస్కార్ అవకాశమెంత: ఉత్తమ నటిగా ఒలీవియా కోల్‌మ్యాన్ నామినేట్ అయ్యే అవకాశముంది. జెస్సీ బక్‌లీ కూడా ఉత్తమ సహాయ నటిగా నామినేట్ అవ్వచ్చు.

ఉత్తమ సినిమా నామినేషన్ కూడా పొందవచ్చు. మ్యాగీ గిల్లెన్ హాల్ కూడా అడాప్టెడ్ స్క్రీన్ ప్లేకు నామినేట్ అయ్యే అవకాశముంది. ఉత్తమ దర్శకురాలిగా నామినేట్ అయితే ఆమె ఆస్కార్‌కు నామినేట్ అయిన 8వ మహిళ అవుతారు.

డిసెంబరు మొదటి వారంలో విడుదల అయింది. డిసెంబరు 31నుంచి నెట్ ఫ్లిక్స్‌లో లభిస్తుంది.

11. డోంట్ లుక్ అప్

డోంట్ లుక్ అప్

కథ - భూమిని తాకనున్న ఒక ప్రమాదకరమైన గ్రహం గురించి హెచ్చరించేందుకు ఇద్దరు వ్యోమగాములు చేసిన ప్రయాణం

ఎవరు నటించారు: లియోనార్డో డికాప్రియో, జెన్నిఫర్ లారెన్స్, మెరిల్ స్ట్రీప్

ఆస్కార్ అవకాశమెంత: ఈ సినిమాలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

డిసెంబర్ మొదట్లో విడుదల అయింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది.

12. కోడా

ఎమీలియా జోన్స్

కథ - రుబీ కుటుంబంలో ఆమెకొక్కరికే వినికిడి శక్తి ఉంటుంది. ఆమెకు సంగీతం నేర్చుకుని తల్లితండ్రులకు సహాయం చేయాలని ఉంటుంది.

ఎవరు నటించారు? ఎమీలియా జోన్స్, మార్లీ మాట్ లిన్, ట్రాయ్ కోట్‌సుర్

ఆస్కార్ అవకాశమెంత? ఉత్తమ సహాయ నటుని విభాగంలో ట్రాయ్ కోట్‌సుర్ నామినేట్ అయ్యే అవకాశముంది.

ఆపిల్ టీవీలో స్ట్రీమ్ అవుతోంది.

ట్రాజెడీ ఆఫ్ మెక్‌బెత్

డెంజెల్ వాషింగ్టన్

కథ - ఒక జమీందారు తన భార్య సహాయంతో స్కాట్‌ల్యాండ్‌కు చక్రవర్తి కావచ్చని ముగ్గురు మంత్రగత్తెలు చెప్పిన మాటలను నమ్మిన షేక్‌స్పియర్ నాటకం ఆధారంగా తీసిన సినిమా.

ఎవరు నటించారు? డెంజెల్ వాషింగ్టన్, ఫ్రాన్సెస్ మెక్ డార్మండ్, కాథరిన్ హంటర్.

ఆస్కార్ అవకాశమెంత: రెండు సార్లు ఆస్కార్ గెలుచుకున్న డెంజెల్ వాషింగ్టన్ ఉత్తమ నటుని విభాగంలో నామినేట్ అయ్యేందుకు అవకాశముంది.

డిసెంబరు 26న విడుదల అయింది.

14. బీయింగ్ ది రికార్డోస్

నికోల్ కిడ్‌మ్యాన్

కథ - 1950 ల నాటి అమెరికా క్లాసిక్ సీరియల్ ఐ లవ్ లూసీ, ల్యూసిల్ బాల్, దేశీ అర్నాజ్ మధ్య సంబంధాన్ని చూపిస్తుంది.

ఎవరు నటించారు? నికోల్ కిడ్‌మ్యాన్, జేవియర్ బార్‌డెం, జేకే సిమ్మన్స్

ఆస్కార్ అవకాశమెంత: ఆరోన్ సార్కిన్ చాలా సార్లు ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు. ఈ సారి కూడా ఒరిజినల్ స్క్రీన్ ప్లేకు నామినేట్ అయ్యే అవకాశముంది. నికోల్ కిడ్‌మ్యాన్ కూడా ఉత్తమ నటిగా నామినేట్ అయ్యే అవకాశముంది.

అమెజాన్ ప్రైమ్‌లో లభిస్తోంది.

15. నో టైం టూ డై

లషానా లించ్, డేనియల్ క్రైగ్

కథ - జేమ్స్ బాండ్ గా డేనియల్ క్రెయిగ్ ప్రమాదకరమైన ప్రత్యర్థిని ఎదుర్కొంటారు.

ఎవరు నటించారు? డేనియల్ క్రెయిగ్, లీసీ డాక్స్, అనా డి అర్మాస్ , రామి మాలిక్, లషానా లించ్

ఆస్కార్ అవకాశమెంత: ఇది ప్రధాన విభాగాల్లో నామినేట్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంది. కానీ, సాంకేతిక విభాగాల్లో నామినేట్ కావచ్చు.

సెప్టెంబరులో విడుదల అయింది. డీవీడీ ల రూపంలో లభిస్తోంది.

2022లో కూడా మరిన్ని మంచి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
15 Movies to Watch in an Oscar Race
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X