భారతీయులతోపాటు 150 మంది పౌరులను కిడ్నాప్ చేసిన తాలిబన్లు: కాబూల్ విమానాశ్రయం వద్ద ఘటన
కాబూల్: ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. వారి అరాచకాలకు అంతే లేకుండా పోతోంది. తాజాగా, కాబూల్ విమానాశ్రయం సమీపం నంచి 150 మంది పౌరులను తాలిబన్లు కిడ్నాప్ చేశారు. ఆప్ఘాన్ నుంచి ఇతర దేశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నవారిని నిర్భంధించారు. అయితే, అపహరణకు గురైన వారిలో ఎక్కువగా భారతీయులే ఉన్నారని తెలుస్తోంది.
Recommended Video
ఈ వార్తల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ వెంటనే అప్రమత్తమైంది. మరో పక్క ఈ వార్తలను తాలిబన్ ప్రతినిధి ఖండించారు. కాగా, భారత వైమానిక విమానం సీ-130 కాబూల్ నుంచి కొద్ది గంటల క్రితం 85 మంది భారతీయుల్ని తరలించింది. ఈ విమానం తజకిస్థాన్‌లోని దుషన్ బేలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఈ సమయంలోనే భారతీయులతోపాటు 150 మందిని తాలిబన్లు కిడ్నాప్ చేసినట్లు వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి.

కాగా, తాలిబన్ల ఆధీనంలో ఉన్న భారతీయులకు ఎలాంటి ప్రమాదం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. స్థానిక పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ చేసిన వారిని తాలిబన్లు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నాయి. ఆ తర్వాత వారిందరినీ సురక్షితంగా విడుదల చేయనున్నారని తెలిపాయి.
Multiple Afghan journalists claim that over 100-150 Indians have been kidnapped by the Taliban from outside the Kabul airport. No official confirmation yet from Indian Government or US/NATO forces on ground. Indian Govt is monitoring closely.
— Aditya Raj Kaul (@AdityaRajKaul) August 21, 2021
This is a DEVELOPING STORY. pic.twitter.com/OFBeIiu4Hy
ఇక, ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల హస్తగతమైననాటి నుంచి ఆ దేశంలో మళ్లీ అరాచకాలు మొదలయ్యాయి. అమాయకులపై దాడులు చేస్తున్నారు. గతంలో ప్రభుత్వానికి సహకరిస్తున్న అధికారులను కాల్చి చంపుతున్నారు. మీడియాలో పనిచేసే మహిళలపై ఒత్తిడి తెస్తున్నారు.
తాలిబన్లకు భయపడి దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు ఆ దేశ పౌరులు. మరో వైపు తమ పిల్లలను రక్షించాలని విదేశీ సైన్యాలను వేడుకుంటున్నారు ఆప్ఘాన్ మహిళలు. తమ తరం పోయిన పర్వాలేదు తమ పిల్లలు బాగుండాలంటే ఇక్కడి నుంచి వారిని తరలించాలని వేడుకుంటున్నారు. ఈ క్రమంలోనే కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద ప్రహారీ గోడలపై నుంచి తమ పిల్లలను అమెరికా భద్రదతా దళాల చేతుల్లోకి విసిరేస్తున్నారు.
ఆప్ఘాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత చేసిన ప్రకటనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు తాలిబన్లు. తాము ఎవరికీ హాని తలపెట్టమని, ప్రజలు, విదేశీయులు సాధారణంగానే ఇక్కడ జీవించవచ్చు అని వ్యాఖ్యానించారు. అయితే, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మాత్రం అలా ఏమాత్రం అనిపించడం లేదు. ఆప్ఘాన్లు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుంటే వారిపై కాల్పులకు తెగబడ్డారు.
జాతీయ జెండాను పట్టుకున్న పౌరుల ప్రాణాలు తీస్తున్నారు. అంతేగాక, గతంలో ఆప్ఘాన్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన ఇళ్లల్లోకి వెళ్లి దాడులు చేస్తున్నారు. తాలిబన్లు షరియా చట్టాన్ని అమలు చేస్తున్నారు. దీంతో ఆప్ఘాన్ మహిళలు పూర్తిగా స్వేచ్ఛను కోల్పోయారు. తాలిబన్లకు భయపడి అనేక సంస్థలు తమ వద్ద పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను తొలగిస్తున్నారు.
తమకు వ్యతిరేకించే వారిపై దాడులు చేస్తూ భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారు. ఇప్పటికే వేలాది మంది ప్రజలు దేశం విడిచి వెళ్లిపోయారు. తాలిబన్ల అరాచక పాలనలో బతకలేమంటూ లక్షలాది మంది ఆప్ఘాన్ ప్రజలు, ఇతర దేశాల పౌరులు కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. భారత్, అమెరికా సహా పలు దేశాలు తమ దేశాలకు చెందిన పౌరులను స్వదేశానికి తరలిస్తున్నాయి.
ఇప్పటికే భారత్ తోపాటు పలు దేశాలు ఆప్ఘాన్‌లోని రాయబార, దౌత్య కార్యాలయాలను మూసేశాయి. తమ సిబ్బందిని స్వదేశాలకు తీసుకెళ్లాయి. ఇంకా ఇక్కడే ఉన్న ప్రజలను తరలించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆప్ఘాన్ లోని భారతీయులను తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాలను కాబూల్‌కు పంపింది. ఇప్పటికే చాలా మందిని స్వదేశానికి చేర్చాయి. ఈ క్రమంలో తాలిబన్లు భారతీయులను కూడా కిడ్నాప్ చేయడం కలకలం రేపుతోంది.












Click it and Unblock the Notifications