షాక్: రెండేళ్ళ బాలికపై దూసుకుపోయిన కార్లు, ప్రాణాలతో బాలిక, ఎలా?

Posted By:
Subscribe to Oneindia Telugu

బీజింగ్: నిత్యం వందలాది వాహనాలతో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఓ రోడ్డులో ఓ రెండేళ్ళ చిన్నారి తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకొంది. రోడ్డు దాటుతుండగా ఆ చిన్నారిపై నుండి రెండు కార్లు వెళ్ళాయి.అదృష్టవశాత్తు ఆ చిన్నారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

చైనాలో నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపైకి రెండేళ్ళ చిన్నారి వచ్చింది.అయితే రోడ్డు దాటే ప్రయత్నం చేస్తోంది. రోడ్డు దాటుతూనే రోడ్డు మద్యకు రాగానే ఆ చిన్నారి వంగింది.

అయితే అదే సమయంలో రెండు కార్లు ఒకదాని వెంట మరోటి ఆ చిన్నారి మీద నుండి వెళ్ళాయి. ఆ చిన్నారిపై నుండి కార్లు వెళ్ళగానే ప్రాణాలు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

2 year old girl survives being run over by two cars while dashing across the road

అయితే కార్లు ఆ చిన్నారిపైకి దూసుకురాగానే ఆ చిన్నారి తెలివిగా రోడ్డుపైనే కూర్చుండిపోయింది.దీంతో ఆ చిన్నారికి ఎలాంటి ప్రాణాపాయం వాటిల్లలేదు.

కార్లు వెళ్ళిపోగానే ఆ చిన్నారి రోడ్డుదాటింది.అయితే ఈ కార్ల అడుగు భాగం కాస్త ఎత్తు ఎక్కువగా ఉన్న కారణంగా ఆ చిన్నారికి ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు.

ఈ ఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయింది. బాలిక అమ్మమ్మ వచ్చి బాలికను తీసుకెళ్ళింది.అయితే బాలిక తలకు స్వల్పగాయాలయ్యాయి. బాలికకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు చెబుతున్నారు.ఈ ఘటన చైనాలో సోమవారం నాడు సియాచిన్ ఫ్రావిన్స్ లో చోటుచేసుకొంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 2 year old girl miraculously survived after getting run over by two vehicles while she was dashing across the street in Xichang, Sichuan province on Monday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి