రెండు కార్లు ఢీ, న్యూయార్క్‌లో 20 మంది మృతి, పెళ్లి బృందాన్ని తీసుకెళ్తున్న లిమో వెహికిల్
న్యూయార్క్: న్యూయార్క్‌లో ప్రమాదంలో దాదాపు ఇరవై మంది చనిపోయారు. ఈ మేరకు న్యూయార్క్ స్టేట్ పోలీసులు ఆదివారం వెల్లడించారు. స్కోహేరీలో శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని టౌన్ సూపర్ వైజర్ అలన్ టావెన్నర్ వెల్లడించారు.
చదవండి: కాంగోలో ఘోర ప్రమాదం: ట్యాంకర్లు ఢీ, 50 మంది సజీవ దహనం, లీకైన ఇంధనం కోసం వచ్చి..
ఢీకొన్న వాటిల్లో ఒకటి లిమో. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక సిబ్బంది అక్కడకు వెళ్లారు. అలాగే విచారణ జరుపుతున్నారు. యాపిల్ బారెల్ కంట్రీ స్టోర్ అండ్ కేఫ్‌కు వెలుపల ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన ప్రాంతం న్యూయార్క్‌కు 270 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రమాదం సమయంలో లిమోనస్ వెహికిల్ పెళ్లి బృందాన్ని తీసుకు వస్తోంది.













Click it and Unblock the Notifications