ముంబై నరమేధం కేసులో ఊహించని మలుపు..!!
26/11 Mumbai attacks: యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన 26/11 ముంబై దాడుల కేసులో ఊహించిన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు ప్రధాన సూత్రధారి డేవిడ్ కోల్‌మన్ హెడ్లేకు సహకారాన్ని అందించిన పాకిస్తాన్- కెనడియన్ బిజినెస్‌మెన్ తహవ్వుర్ రాణాను భారత్ పంపించడానికి అమెరికా న్యాయస్థానం అంగీకారం తెలిపింది.
2008 నవంబర్ 26వ తేదీన ముంబైపై లష్కరే తొయిబా ఉగ్రవాదులు విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో 166 మంది మరణించారు. తాజ్‌మహల్ హోటల్, ఓబెరాయ్ ట్రైడెంట్ హోటల్, కామా ఆసుపత్రి, ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్, నారీమన్ హౌస్, మెట్రో సినిమా, లెపార్డ్ కేఫ్..వంటి ప్రాంతాలపై ఉగ్రవాదులు జరిపిన దాడులు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి.

ఏకే 47 రైఫిళ్లు, ఆర్డీఎక్స్, ఐఈడీ, గ్రెనేడ్లు.. ఇలా మారణాయుధాలతో నరమేధాన్ని సృష్టించారు. బాంబింగ్, మాస్ షూటింగ్‌కు పాల్పడ్డారు. ఈ దాడుల కోసం కావాల్సిన ఆర్థిక సహకారాన్ని అందించాడనే ఆరోపణలు తహవ్వూర్ రాణాపై ఉన్నాయి. మారణాయుధాలను కొనుగోలు చేయడానికి, వాటిని చేరవేయడానికీ పూర్తి సహకారాన్ని ఇచ్చారనే విమర్శలను అతను ఎదుర్కొంటోన్నాడు.
పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ, లష్కరే తొయిబాతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయనడానికి సాక్ష్యాలను సంపాదించింది భారత్. అతన్ని ముంబై దాడుల సందర్బంగా పోలీసులు రూపొందించిన 405 పేజీల ఛార్జిషీట్‌లోనూ తహవ్వుర్ రాణా పేరుంది. అతన్ని భారత్‌కు తీసుకుని రావడానికి భారత్ చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు.
దీన్ని సవాల్ చేస్తూ అతను అమెరికా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు రాణా. చట్టవిరుద్ధంగా తనను రప్పించడానికి భారత్ ప్రయత్నాలు సాగిస్తోందంటూ పిటీషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణను నిర్వహించిన శాన్ ఫ్రాన్సిస్కో నార్త్ సర్క్యుట్ కోర్ట్.. అతన్ని భారత్‌కు పంపించడానికి అంగీకారం తెలిపింది. భారత్‌కు రప్పించిన తరువాత ఇక్కడి చట్టాల ప్రకారం అతన్ని శిక్షించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications