వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ జైలులో పోలీసులకు ఖైదీలకు మధ్య కాల్పులు..32 మంది మృతి

|
Google Oneindia TeluguNews

తజికస్తాన్ జైలులో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులతో పాటు 29 మంది ఖైదీలు మృతి చెందారు. జైలులోకి చొచ్చుకొచ్చిన ఐసిస్ మిలిటెంట్లు పోలీసుల మధ్య కాల్పులు జరిగాయని తజికిస్తాన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. తజికిస్తాన్ రాజధాని దుషాంబేకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వక్దత్ నగరంలోని జైలులోకి ఐసిస్ ఉగ్రవాదులు చొరబడి జైలుకు కాపలాగా ఉన్న ముగ్గురు పోలీసులను ఐదు మంది ఖైదీలను కత్తితో నరికి హత్యచేశారని ఆ దేశ ప్రభుత్వం తెలిపింది.

అనంతరం జైలు ఆవరణలోనే ఉన్న హాస్పిటల్‌లోకి వెళ్లి శిక్ష పొందుతున్న పలువురు ఐసిస్ ఉగ్రవాదులను తీసుకుని తప్పించుకునే ప్రయత్నించారు. ఈ క్రమంలోనే భద్రతాదళాలు అలర్ట్ అయి 24 మంది మిలిటెంట్లపై కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 24 మంది మృతి చెందారు. వారు తప్పించుకునేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది వారిపై కాల్పులు జరిపి మట్టుబెట్టిందని ఆ దేశ న్యాయశాఖ మంత్రి తెలిపారు. ఆ జైలులో 1500 మంది ఖైదీలు శిక్ష అనుభవిస్తున్నారు.

32 inmates killed in Tajikistan Jail after riots, All belong to ISIS

ఇక పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన వారిలో ఇస్లామిక్ రినైస పార్టీ ఆఫ్ తజికిస్తాన్‌కు చెందిన ఇ్దరు సీనియర్ సభ్యులు ఉన్నారు. ఇది తజికిస్తాన్‌లో నిషేధంలో ఉన్న ఇస్లామిక్ పార్టీ. కాల్పుల్లో మృతి చెందిన వారిలో మరొక మతగురువు ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. ఆ మతగురువు తజికిస్తాన్ ప్రభుత్వాన్ని కూలదోయాలనే కుట్ర చేశారని అందుకే ఆయన్ను అరెస్టు చేసి జైలుకు పంపినట్లు తజికిస్తాన్ ప్రభుత్వం తెలిపింది. ఇక జైలులోకి వచ్చిన ఐసిస్ ఉగ్రవాదుల్లో ఒకరు బెక్రూజ్ గుల్మొరాద్‌గా గుర్తించారు. ఈయన గుల్మొరాద్ ఖలీమోవ్ అనే తజికిస్తాన్ స్పెషల్ ఫోర్సెస్ కల్నల్‌ కొడుకు. 2015లో ఐసిస్ పట్ల ఆకర్షితుడై ఖలిమోవ్ అందులో చేరినట్లు తజికిస్తాన్ ప్రభుత్వం తెలిపింది. అయితే భద్రతా బలగాల కాల్పుల్లో ఆయన సిరియాలో మృతి చెందాడు.

ఇదిలా ఉంటే తజికిస్తాన్‌లోని కొన్ని వేల మంది ఐసిస్‌కు ఆకర్షితులై అందులో చేరినట్లు సమాచారం. అయితే ఐసిస్‌లో పెద్దతలకాయలు లేవు. అయినప్పటికీ అడపాదడపా దాడులు చేస్తూనే ఉంది. గతేడాది నవంబర్‌లో మరో జైలులో జరిగిన ఘర్షణలకు కూడా బాధ్యత తమదే అని ఐసిస్ ప్రకటించింది.

English summary
Three prison guards and 29 inmates were killed in a prison riot in Tajikistan that the government blamed on Islamic State militants.Tajikistan's Justice Ministry said the riot broke out late on Sunday in the prison in the city of Vakhdat, 10 km (six miles) east of the capital Dushanbe, as militants armed with knives killed three guards and five fellow prisoners.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X