ALERT: అంతుచిక్కని వ్యాధి.. 48 గంటల్లో 50 మంది మృతి..!
కొవిడ్-19 తర్వాత.. రోజుకో వైరస్ పుట్టుకొస్తోంది. అంతుచిక్కని వ్యాధులతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మృత్యువాత పడుతున్నారు. తాజాగా డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని వాయువ్య ప్రాంతంలో ఓ అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వైరస్ సోకి నెలరోజుల్లోనే 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యాధి లక్షణాలు బయటపడిన 48 గంటల్లోనే ప్రజలు మృతి చెందుతున్నారు. దీంతో వైద్య నిపుణులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గబ్బిలాలు తిన్న ముగ్గురు పిల్లల్లో మొదట ఈ వ్యాధిని గుర్తించినట్లు తెలుస్తోంది.
లక్షణాలు ఇవే..
జ్వరం, వాంతులు, అంతర్గత రక్తస్రావం లక్షణాలు ఉన్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) అందించిన వివరాల ప్రకారం.. జనవరి 21న కాంగోలో ఈ వ్యాధికి సంబంధించిన కేసులు వెలుగులోకి వచ్చాయి. ఫిబ్రవరి 16 నాటికి 431 కేసులు నమోదు కాగా 53 మరణాలు సంభవించాయి.

వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. మరోవైపు ఈ అంతుచిక్కని వ్యాధిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని డబ్ల్యూహెచ్ఓ ఓ ప్రకటనలో పేర్కొంది.












Click it and Unblock the Notifications