కుప్పకూలిన హెలికాప్టర్: ఆరుగురు మృతి, మహిళను కాపాడారు
ఖాట్మాండ్: నేపాల్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. గోర్ఖా జిల్లా నుంచి శనివారం ఉదయం టేకాఫ్ అయిన ఈ హెలికాప్టర్ బయలు దేరిన కొద్దిసేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయని సంబంధిత అధికారులు వెల్లడించారు.

విమానంలో ఆరుగురు ప్రయాణికులు, పైలట్ ఉన్నారు. వీరిలో జపాన్‌కు చెందిన ఓ పర్వతారోహకుడు ఉన్నట్లు తెలిపారు. 'హెలికాప్టర్ శిథిలాలు ధాఢింగ్ జిల్లాలోని పర్వతాల నడుమ అటవీ ప్రాంతంలో కనుగొన్నాం. మరో హెలికాఫ్టర్ ద్వారా, కాలినడకన సహాయ బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి'' అని ఖాట్మాండ్ విమానాశ్రయ జనరల్ మేనేజర్ రాజ్ కుమార్ ఛత్రి తెలిపారు.
కాగా, ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా, ఓ మహిళా ప్రయాణికురాలిని సహాయ సిబ్బంది రక్షించారు. నేపాల్‌లో హెలికాప్టర్ల వినియోగం చాలా ఎక్కువ. రహదారులు లేని ప్రాంతాలకు పర్యాటకులను తీసుకెళ్లేందుకు అక్కడ వీటిని విరివిగా ఉపయోగిస్తారు. కానీ, వాయు మార్గ ప్రయాణంలో పాటించాల్సిన భద్రత ప్రమాణాలు పాటించని కారణంగానే ఇలాంటి ప్రమాదాలు చేసుకుంటున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications