అట్టుడుకుతోన్న ఇజ్రాయెల్: గాజాపై భీకర ప్రతిదాడి: కుప్పకూలిన 13 అంతస్తుల అపార్ట్‌మెంట్
జెరూసలేం: కొద్దిరోజులుగా నివురు గప్పిన నిప్పులా ఉంటూ వస్తోన్న పాలస్తీనా-గాజా మధ్య దాడులు, ప్రతిదాడులు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. జనావాసాలను లక్ష్యంగా చేసుకుని గాజాలోని ఇస్లామిక్ హమాస్ ప్రభుత్వం నిర్వహించిన దాడులను ఇజ్రాయెల్ తిప్పి కొట్టింది. హమాస్ జరిపిన దాడుల్లో భారతీయ మహిళ సహా ముగ్గురు మరణించారు. ఈ దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ సైన్యం రాకెట్లను ప్రయోగించింది గాజా సిటీపై. ఈ దాడిలో 13 అంతస్తుల అపార్ట్‌మెంట్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలోో 35 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది.
అయిదు నిమిషాల్లో 137 రాకెట్లు..
తొలుత- గాజా స్ట్రిప్‌లో అధికారంలో ఉన్న హమాస్.. ఇజ్రాయెల్‌లోని జనావాసాలను లక్ష్యంగా చేసుకుని రాకెట్లతో దాడులు చేసింది. మిస్సైళ్లను సంధించింది. ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని అయిదు నిమిషాల వ్యవధిలో 137 రాకెట్లను సంధించినట్లు హమాస్ ప్రకటించుకుంది. ఈ ఘటనలో పలు జనావాసాలు ధ్వంసమయ్యాయి. వాహనాలు దగ్ధమయ్యాయి.
అష్కెలాన్‌లోని బుర్సాలీపై పడిన కొన్ని రాకెట్లు అక్కడి భవనాలను ధ్వంసం చేశాయి. ఈ ఘటనలో కేరళకు చెందిన సౌమ్య అనే అయిదుమంది మరణించారు. 80కి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో పలువురు ఇజ్రాయెలీలు, పాలస్తీనియన్లు ఉన్నారు.

ప్రతిదాడుల్లో కుప్పకూలిన అపార్ట్‌మెంట్..
దీనికి ప్రతిగా ఇజ్రాయెల్.. గాజా సిటీపై వైమానిక దాడులను చేపట్టింది. రాకెట్లను సంధించింది. ఈ ఘటనలో గాజాసిటీలో 13 అంతస్తుల అపార్ట్‌మెంట్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 35 మంది మరణించారు. పలువురు శిథిలాల మధ్య చిక్కుకున్నారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మరణాల సంఖ్య పెరగొచ్చనే ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి. ఒకదాని వెంట ఒకటి నిప్పులు చిమ్ముకుంటూ వచ్చి పడుతోన్న రాకెట్లతో గాజా స్ట్రిప్, ఇజ్రాయెల్ అట్టుడికిపోయాయి. జనం భయాందోళనలతో గడిపారు.
Recommended Video

ఆందోళన వ్యక్తం చేసిన అమెరికా..
ఈ దాడులు, ప్రతిదాడుల పట్ల అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్..తన ఇజ్రాయెల్ కౌంటర్‌పార్ట్ గాబీ అష్కెనాజీతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ రెండు దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలు, దాడుల వల్ల సాధారణ ప్రజలు బలి అవుతున్నారని గుర్తు చేశారు. మృతుల పట్ల సంతాపాన్ని తెలిపారు. దాడులు, ప్రతిదాడులను వెంటనే నిలిపివేయాలని కోరారు. మృతుల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారని చెప్పారు. చర్చల ద్వారా, సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలని బ్లింకెన్.. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రికి సూచించారు.












Click it and Unblock the Notifications