వ్యాక్..! సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కోసం మరీ ఇలానా..!
బీజింగ్ : సోషల్ మీడియా ప్రభంజనం ప్రపంచాన్ని ఊపేస్తున్న తరుణంలొ.. ఏం చైసైనా సరే, ఫాలోవర్స్ ని పెంచుకోవాలనే ఆతృతలో మంచి-చెడులను సైతం పక్కనబెట్టి, చిత్ర విచిత్ర పోకడలకు తెరలేపుతున్నారు కొంతమంది నెటిజెన్స్. ఓవర్ నైట్ స్టార్ లాగా రాత్రికే రాత్రే సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించాలనే అత్యాశతో మతిలేని చర్యలకు పాల్పడుతున్నారు.
ముఖ్యంగా లైకులు, కామెంట్లతోనే ఆకలి నింపుకుంటున్న నేటి నెటిజెన్స్ తరహాలో.. ఆకలి తీర్చుకోవడం ద్వారానే సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ ని పెంచుకోవాలని భావించింది చైనాకు చెందిన ఓ యువతి. అయితే అందరూ తినేవే మనమూ తింటే అందులో ప్రత్యేకత ఏముంది అనుకుందో ఏమో.. మొత్తానికి అందరి దృష్టిని తనవైపు తిప్పుకోవడం కోసం విచిత్రపు ఆహారపు అలవాట్లను అలవాటు చేసుకుంది.
'ప్రాణంతో ఉన్న వానపాములను, పాముల్లాంటి వింత చేపలను పాపెర్లు, ఇంట్లో ఉన్న ఎలక్ట్రిక్ వస్తువులను, ప్టాస్టిక్ సామాగ్రిని తినేయడం మొదలుపెట్టింది'. ఇదంతా చూసి షాక్ తిన్న కూతురు తల్లి విషయమేంటా..? అని ఆరా తీసేందుకు ప్రయత్నించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు రంగంలోకి దిగాక గానీ అసలు విషయం బయటపడలేదు. పోలీసుల ముందు నిజం అంగీకరించిన సదరు యువతి తనకున్న ఓ ఆన్ లైన్ ఖాతాలో ఫాలోవర్స్ ను పెంచుకోవడం కోసమే ఇలాంటి తిండికి అలవాటు పడినట్టు చెప్పుకొచ్చింది. అయితే తన విచిత్రపు ఆహార అలవాట్ల పట్ల నెటిజెన్స్ నిజంగానే ఆసక్తి కనబర్చడంతో ఆమె ఖాతాలో మూడు లక్షల మంది ఫాలోవర్స్ వచ్చి చేరారట.
మొత్తానికి లైకులు కామెంట్లు, ఫాలోవర్స్ కోసం ఇప్పటి యువత ఎంతదాకైనా తెగించే పరిస్థితి వచ్చిందనే దానికి ఇలాంటి ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణ.












Click it and Unblock the Notifications