ఒక అమ్మాయి - 20 మంది బాయ్ ఫ్రెండ్స్.. సొంతింటి కోసం బడా ప్లాన్ !
ప్రేమ.. ఈ రెండక్షరాల ఎమోషన్ మనుషులను పిచ్చి వాళ్లని చేస్తుంది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ప్రేమ పేరుతో జరుగుతున్న ఎన్నో మోసాలను మనం చూస్తూనే ఉంటున్నాం. మానవ సంబంధాలు రోజురోజుకీ విలువలు కోల్పోతూ కేవలం అవసరాలకు మాత్రమే వాటిని వినియోగించుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో అయితే భార్యలు ప్రియుడితో కలిసి భర్తను హతమార్చడం ఓ ప్యాషన్ అయిపోయింది. అలానే భర్తలు సైతం భార్యలను హత్య చేసిన ఘటనలు ఉన్నాయి.
ఈ పరిస్థితుల్లో ఓ యువతి ప్రేమ పేరుతో ఘరానా మోసానికి తెర లేపింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 20 మంది బాయ్ ఫ్రెండ్స్ ని బురిడీ కొట్టించింది. ఒకరికి తెలియకుండా మరొకరితో రిలేషన్ షిప్ లో ఉంటూ మొత్తానికి తన సొంతింటి కలను నిజం చేసుకుంది. వినడానికి షాకింగ్ గా ఉన్న ఈ ఘటన సోషల్ మీడియా పుణ్యమా అని వెలుగు లోకి వచ్చింది. ఈ వైరల్ ఘటన చైనాలో చోటు చేసుకోగా.. పూర్తి వివరాలను తెలుసుకుందాం...

చైనాలోని షెన్జెన్‌కు చెందిన షియాలీ అనే యువతి తన తల్లితండ్రులతో కలిసి నివసిస్తోంది. ఆమె తండ్రి మైగ్రంట్ వర్కర్‌గా, తల్లి గృహిణిగా ఉన్నారు. మధ్యతరగతికి చెందిన తమ ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని.. సొంత ఇంటి కోసం ఓ పక్కా ప్లాన్ వేసింది. తన అవసరాన్ని తీర్చుకునేందుకు ప్రేమను ఆయుధంగా మార్చుకుంది. ఏకంగా 20 మంది బాయ్ ఫ్రెండ్స్ తో ప్రేమలో ఉంటున్నట్టు నటించి.. ఒక్కొక్కరి నుంచి ఐఫోన్ గిఫ్ట్ గా పొందింది.
ఈ ఫోన్లను ఓ మొబైల్ రీసైక్లింగ్ కంపెనీకి అమ్మేసి రూ.14 లక్షలు (1,20,000 యువాన్) సంపాదించింది. ఆ డబ్బుతో తాను ఎప్పటి నుంచో కలలు కన్న ఒక ఇంటిని కొనుక్కుందట. ఈ వార్త ఎలా బయటికి వచ్చిందో తెలియకపోయినా ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లో వైరల్ అవుతోంది. సొంత ఇంటి కోసం ఈ రకంగా వ్యవహరించడం కరెక్ట్ కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications