ఉక్రెయిన్-రష్యా మధ్య కీలక ఘట్టం.. విదేశాంగ మంత్రుల భేటీ..!! ఆ దేశం చొరవతో..

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముగింపునకు ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఆయా దేశాలు రష్యా అధ్యక్షడు పుతిన్ తో మాట్లాడాయి. తమ షరతులకు ఉక్రెయిన్ అంగీకరిస్తే సైనిక చర్యలను తక్షణం ఆపేస్తామని రష్యా ప్రకటించింది. అటు రష్యా అధ్యక్షడు పుతిన్ తో ప్రధాని మోదీ మాట్లాడారు. ఉక్రెయిన్-రష్యా మధ్య నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పుతిన్ ను కోరారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో నేరుగా చర్చలు జరపాలని పుతిన్ కు మోదీ సూచించారు. ఉక్రెయిన్ లో పలు ప్రాంతాలలో కాల్పుల విరమణ ప్రకటించడం శుభపరిణామమని అభినందించారు.

టర్కీ చొరతో చర్చలు..
రష్యా ఉక్రెయిన్ ల మద్య నెలకొన్న వివాదానికి ముగింపు పలికేందుకు తమ దేశ అధ్యక్షుడు రెసెప్ తైపీ ఎర్డోగాన్ చొరవ తీసుకున్నారని టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లుట్ కావుసోగ్లు వెల్లడించారు. దౌత్య ప్రయత్నాల ఫలితంగా ఉక్రెయిన్, రష్యా విదేశాంగ మంత్రులు దిమిత్రో కులేబా, సెర్గీ లావ్రోవ్ లు సమావేశమైయ్యేందుకు అంగీకరించినట్లు తెలిపారు. వీరి భేటీ అంటల్యా డిప్లొమసీ ఫోరం వేదిక కానుందని జరగనుందని పేర్కొన్నారు. మార్చి 10న నిర్వహించే ఈ కార్యక్రమంలో తానూ కూడా భాగం అవుతున్నట్లు చెప్పారు. తమ ప్రయత్నాలు శాంతి, స్థిరత్వానికి దారితీస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

A key event between Ukraine and Russia Meeting with Foreign Ministers with initiative of Turkey country

షరతులు ఓకే అంటే.. యుద్ధానికి ఫుల్ స్టాప్
మరోవైపు ఉక్రెయిన్ తమ షరతులను అంగీకరిస్తే.. తక్షణమే యుద్ధాన్ని ఆపేస్తామని రష్యా ప్రకటన చేసింది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ మీడియా కార్యదర్శి దిమిత్రీ పెస్కోవ్ వెల్లడించారు. తమ సైనిక చర్యలను ఆపేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. అటురష్యా -ఉక్రెయిన్ ప్రతినిధులు మూడో విడత చర్చలు ప్రారంభించారు. ఇప్పటికే రెండు సార్లు వారి మధ్య చర్చలు జరిగినా ఎలాంటి పురోగతి రాలేదు. ఈ నేపథ్యంలో ఈ మూడో విడత చర్చలైనా సఫలం కావాల‌ని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. ఇరుదేశాల చర్చలపై ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ చర్చలు ఫలిస్తే గత 12 రోజులుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధపోరుకు ఫుల్ స్టాప్ పడుతుంది. ప్రస్తుతం నాలుగు నగరాల్లో రష్యా కాల్పుల విరమణ ప్రకటించింది. కీవ్, ఖార్కివ్, సుమీ, మారియుపోల్ నగరాల్లోని ప్రజలను తరలించేందుకు చర్యలు చేపట్టింది. మానవతా కారిడార్ లను ప్రాంభించినట్లు ప్రకటించాయి.
==

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+