ఆఫ్ఘన్ పార్లమెంట్‌లో భారతీయ ఎంపీలు: తాలిబన్ల చెర నుంచి సురక్షితంగా స్వదేశానికి
కాబుల్: కరడుగట్టిన మత ఛాందసవాదులు, అరాచకత్వానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన తాలిబన్ల పరిపాలన.. ప్రత్యక్ష నరకాన్ని తలపిస్తుంది. వారు విధించే ఆంక్షలు, నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయనేది ప్రపంచం మొత్తం ఇదివరకే ఓ సారి చవి చూసింది కూడా. తాలిబన్లు అమలు చేసే షరియా చట్టం గురించి వింట ఆఫ్ఘనిస్తానీయుల్లో దడ పడుతుంది. అత్యంత కఠినమైన ఆ ఆంక్షలను అనుసరించడం అనే ఊహనే భరించలేకపోతోన్నారు అక్కడి ప్రజలు. దీన్ని భరించలేకే వారంతా దేశం విడిచి వెళ్లడానికి విశ్వప్రయత్నాలు సాగిస్తోన్నారు.
తాలిబన్ల పరిపాలన అంటే చివరికి- ప్రజా ప్రతినిధులు కూడా భయపడే స్థితికి చేరిందక్కడి వాతావరణం. ఆఫ్ఘనిస్తాన్‌లో స్థిరపడిన భారతీయ సిక్కులు ప్రాణాలతో బయటపడితే చాలనుకుంటోన్నారు. ఆఫ్ఘన్‌లో స్థిరపడిన కొందరు భారతీయ సిక్కులు ఆ దేశ పార్లమెంట్‌కు కూడా ఎంపికయ్యారు. అష్రఫ్ ఘనీ సారథ్యంలోని ప్రభుత్వంలో పనిచేశారు. ఇప్పుడు వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాజకీయ అస్థిరత నెలకొనడంతో అక్కడ నివసించడానికి కూడా సాహసించట్లేదు.

ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు అష్రఫ్ ఘనీ ప్రభుత్వాన్ని కుప్పకూల్చారు. తమ సారథ్యంలో ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి సిద్ధపడుతున్నారు. ఫలితంగా- అష్రఫ్ ఘనీ ప్రభుత్వంతో పాటుగా అక్కడి పార్లమెంట్ కూడా రద్దయింది. పార్లమెంట్‌కు ఎన్నికైన భారతీయ సిక్కులు ఆ దేశాన్ని విడిచిపోతోన్నారు. స్వదేశానికి చేరుకుంటోన్నారు. తాలిబన్లు- రాజధాని కాబుల్‌ను ఆక్రమించుకున్న తరువాత భారతీయ సిక్ ప్రజా ప్రతినిధులు వారి చెరలో ఉన్నారు.
NEW: Afghan Senator Dr. Anarkali Kaur Honaryar @DrAnarkaliH thanks Indian Prime Minister @narendramodi, Indian External Affairs Minister @DrSJaishankar for rescuing her and other Afghan Sikh minority members from Kabul tonight. She confirms that she is on way to New Delhi. pic.twitter.com/2wQuNWCDln
— Aditya Raj Kaul (@AdityaRajKaul) August 21, 2021
ఆఫ్ఘన్ పార్లమెంట్ సభ్యుడు నరేంద్ర సింగ్ ఖల్సా, సెనెటర్ డాక్టర్ అనార్కలి కౌర్ హొనర్యార్ భారత్‌కు తిరుగుముఖం పట్టారు. తాలిబన్ల చెరలో ఉన్న తమను అమెరికా, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, భారత బలగాలు వారిని రక్షించాయని, ఇక్కడ నివసించే వాతావరణం లేదని పేర్కొన్నారు. భారత్‌కు రానున్నట్లు చెప్పారు. తమను రక్షించిన భారత బలగాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సెల్ఫీ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
#BREAKING: Afghan MP Narender Singh Khalsa thanks Indian Prime Minister @narendramodi, Indian Government & Indian Air Force for rescuing him and Afghan Sikh minority community from Taliban in Kabul tonight. His father Avtar Singh was killed in a 2018 terror attack in Jalalabad. pic.twitter.com/c5UaNJH8tu
— Aditya Raj Kaul (@AdityaRajKaul) August 21, 2021
ఎంపీ నరేంద్ర సింగ్ ఖల్సా.. ఆఫ్ఘన్‌లోనే జన్మించారు. జలాలాబాద్‌లో ఆయన కుటుంబం నివసిస్తోంది. ఆయన పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 2018లో జలాలాబాద్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో నరేంద్ర సింగ్ ఖల్సా తండ్రి మరణించారు. డాక్టర్ అనార్కలి కౌర్ హొనర్యార్, నరేంద్ర సింగ్ ఖల్సా పూర్వీకులు భారతీయులే. పంజాబ్ నుంచి వారు వలస వెళ్లారు. కాగా- అనార్కలి కౌర్ హొనర్యార్.. ఆఫ్ఘనిస్తాన్ సెనెట్‌కు ఎన్నికయ్యారు. నిర్బంధ పరిస్థితుల్లోనూ ఆమె వైద్య విద్యను అభ్యసించారు.












Click it and Unblock the Notifications