అఫ్గాన్‌లో బాంబుపేలుడు: 15మంది మృతి
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లోని కాబూల్‌పట్టణం గురువారం బాంబు పేలుడుతో దద్దరిల్లింది. ఈ ఆత్మాహుతి బాంబుదాడిలో 15మంది మృతి చెందినట్లు సమాచారం. మరో 20మంది వరకు గాయాలపాలయ్యారు.
ఆఫ్ఘనిస్థాన్ భద్రతా సిబ్బంది మత్తుమందులు, మద్యానికి వ్యతిరేకంగా ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అమెరికా, ఇతర దేశాల దౌత్యకార్యాలయాలకు సమీపంలో ఈ పేలుడు సంభవించడం గమనార్హం.

నాలుగు వాహనాల్లో మృతదేహాలను తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని స్థానిక పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాగా, ఆత్మాహుతి దాడికి పాల్పడిన నిందితుడు భద్రతా సిబ్బంది దుస్తుల్లో వచ్చినట్టు గుర్తించారు. మాదక ద్రవ్యాల తనిఖీ బృందంతో కలిసిపోయి ఈ పేలుడుకు పాల్పడినట్టు సమాచారం.












Click it and Unblock the Notifications