Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆఫ్ఘనిస్తాన్‌పై విరుచుకుపడిన ఐసిస్ ఉగ్రవాదులు: సైనిక ఆసుపత్రిపై ఆత్మాహూతి దాడి

కాబుల్: ఇస్లామిక్ దేశం ఆఫ్ఘనిస్తాన్‌‌లో ఇస్లామిక్ స్టేట్స్ ద ఇరాక్ అండ్ లెవాంట్ ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. విరుచుకుని పడ్డారు. రాజధాని కాబుల్‌లోని సైనిక ఆసుపత్రిపై భయానక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 19 మంది దుర్మరణం పాలయ్యారు. 60 మంది వరకు గాయపడ్డారు. వారిలో పలువురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితంగా- మరణాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమౌతోంది.

వరుస దాడులతో..

వరుస దాడులతో..

కరడు గట్టిన మత ఛాందసవాదులుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తాలిబన్ల దురాక్రమణలోకి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లిన తరువాత ఇస్లామిక్ స్టేట్స్ ఉగ్రవాదులు తరచూ ప్రాణాంతక దాడులకు దిగుతున్నారు. ఇదివరకు కాబుల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఆత్మాహూతి దాడి చేశారు. అప్పటి ఘటనలో పలువురు దుర్మరణం పాలయ్యారు. ఆ తరువాత కూడా ఇవే తరహా దాడులు కొనసాగాయి. మసీదులను టార్గెట్ చేశారు. శుక్రవారం నాటి ప్రార్థనలపై దాడులకు దిగారు.

కాబుల్ మిలటరీ ఆసుపత్రిపై..

కాబుల్ మిలటరీ ఆసుపత్రిపై..

ఇక తాజాగా- కాబుల్‌లోని మిలటరీ ఆసుపత్రిపై ఉగ్రదాడికి పాల్పడ్డారు. బాంబులు విసిరారు. తుపాకులతో యథేచ్ఛగా కాల్పులకు దిగారు. ఈ ఘటనలో 19 మంది మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఐసిస్‌‌కు అనుబంధంగా కొనసాగుతోన్న ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ఐసిస్-కేపీ) ఈ ఉగ్రదాడికి కారణం అని తాలిబన్లు ప్రకటించారు. ఇస్లామిక్ స్టేట్స్‌కు చెందిన అయిదుమంది ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నట్లు తెలిపారు.

డాక్టర్లు, హెల్త్ వర్కర్లు లక్ష్యంగా..

డాక్టర్లు, హెల్త్ వర్కర్లు లక్ష్యంగా..

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్లు, హెల్త్ వర్కర్లు, పేషెంట్లు, వారి సంబంధీకులను టార్గెట్‌గా చేసుకుని ఉగ్రవాదులు ఈ దాడిని చేశారని, ప్రజల్లో భయాందోళనలు సృష్టించాలనేది వారి ఏకైక లక్ష్యమని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ దాడి మొదలైన వెంటనే తాలిబన్ బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని, 15 నిమిషాల వ్యవధిలో పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చాయని స్పష్టం చేశారు.

 19 మంది దుర్మరణం..

19 మంది దుర్మరణం..

ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడులను నివారించడానికి అమెరికా వదిలి వెళ్లిన హెలికాప్టర్‌ను వినియోగించామని పేర్కొన్నారు. తొలుత- ఆత్మాహూతి దళ సభ్యుడు ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద తనను తాను పేల్చుకున్నారని, దానివల్ల భయభ్రాంతులకు గురై.. బయటికి పరుగులు తీస్తోన్న డాక్టర్లు, పేషెంట్లు, వారి సంబంధీకులపై మిగిలిన టెర్రరిస్టులు యథేచ్ఛగా కాల్పులు జరిపారని జబీహుల్లా వివరించారు. ఈ ఘటనలో 19 మంది దుర్మరణం పాలయ్యారని పేర్కొన్నారు.

Recommended Video

    ఏపిలో అరాచకం రాజ్యమేలుతుందన్న టీడిపి జాతీయ అధికార ప్రతినిధి దివ్యవాణి || Oneindia Telugu
    ఏరివేత కోసం

    ఏరివేత కోసం

    ఈ ఘటనలో ఇద్దరు తాలిబన్లు కూడా దుర్మరణం పాలైనట్లు వార్తలు వచ్చాయి. దీన్ని ధృవీకరించలేదు. తాలిబన్ ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి ఐసీస్-ఖొరాసన్ ప్రావిన్స్ కుట్ర పన్నిందని, ఇందులో భాగంగానే ఇలాంటి దాడులతో ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోందని ముజాహిద్ ఆరోపించారు. వారి ఆటలను సాగనివ్వబోమని అన్నారు. ఉగ్రవాదులను ఏరివేయడానికి త్వరలోనే ఇంటింటి గాలింపు చర్యలను చేపట్టాలని యోచిస్తున్నట్లు స్పష్టం చేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+