కాబుల్‌లో కాల్పులు, పేలుళ్ల హోరు: ఎంబసీ వద్దా: ఎయిర్‌పోర్టులో: ప్రాణభయంతో

కాబుల్: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల విజృంభణకు యథేచ్ఛగా కొనసాగుతోంది. అమెరికా తన బలగాలను ఉపసంహరించుకున్న అతి కొద్దిరోజుల్లోనే.. ఆ దేశం మొత్తాన్నీ ఆక్రమించేశారు. రాజధాని కాబుల్‌ను కూడా వశం చేసుకున్నారు. ఇక ఆ దేశంలో తాలిబన్ల పాలన ఆరంభం కావడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఇప్పటికే దేశం విడిచి వెళ్లిపోయారు. రక్తపాతాన్ని నివారించడానికే తాను దేశాన్ని వీడాల్సి వచ్చిందంటూ ఓ ప్రకటన చేశారు.

 కాబుల్ అల్లకల్లోలం..

కాబుల్ అల్లకల్లోలం..

అమెరికా తన రాయబార కార్యాలయ అధికారులు, ఉద్యోగులను తరలిస్తోంది. వారికి రక్షణగా ఇప్పటికే ఆరు వేల ట్రూపులను కాబుల్‌లో మోహరింపజేసింది. ఈ సంఖ్యను మరింత పెంచనుంది. కాగా- తాలిబన్లు.. రాజధానిని ఆక్రమించుకున్న తరువాత అక్కడి పరిస్థితులు అల్లకల్లోలంగా తయారయ్యాయి. వందలాది మంది తాలిబన్లు మిడతల దండులా కాబుల్‌ను ఆక్రమించుకున్నారు. ప్రభుత్వ భవనాలపై తమ జెండాలను పాతేశారు. లూటీలకు పాల్పడుతున్నారు.

ఎయిర్ పోర్టులో కాల్పులు

ఎయిర్ పోర్టులో కాల్పులు

తాలిబన్లు ప్రవేశించినప్పటి నుంచీ.. కాబుల్ కాల్పులతో మారుమోగిపోతోంది. పేలుళ్లతో హోరెత్తిపోతోంది. అమెరికా రాయబార కార్యాలయం, అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ అధికారిక నివాసం వద్ద భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అంతకుముందే- అమెరికా సైన్యం అక్కడ పనిచేస్తోన్న రాయబారి, హైకమిషనర్, ఇతర ఉద్యోగులు.. వారి కుటుంబ సభ్యులను కాబుల్ విమానాశ్రయానికి సురక్షితంగా తరలించింది. తాలిబన్లు ఊహించిన దాని కంటే వేగంగా కాబుల్‌ను ఆక్రమించుకోవడం వల్ల వారి అంచనాలన్నీ తలకిందులయ్యాయి.

 ఎయిర్‌పోర్టులో కాల్పులు..

ఎయిర్‌పోర్టులో కాల్పులు..

మరోవంక- కాబుల్ ఎయిర్ పోర్టులో భారీగా కాల్పుల శబ్దాలు వినిపించాయి. దీనివల్ల ఎలాంటి ప్రాణనష్టం సంభవించిందనేది ఇంకా తెలియరాలేదు. తాలిబన్ల పరిపాలనకు భయపడి వందలాది మంది స్థానికులు దేశం విడిచి వెళ్లడానికి ప్రయత్నిస్తోన్నారు. గుంపులు గుంపులుగా విమానాశ్రయానికి చేరుకుంటోన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్నాయి. విమానాశ్రయానికి దారితీసే మార్గాలన్నీ స్థానికులతో నిండిపోయాయి. ఎప్పుడూ లేనంత తాకిడి విమానాశ్రయం వద్ద కనిపించింది.

దేశం విడిచిపోవడం తప్ప

దేశం విడిచిపోవడం తప్ప

తాలిబన్లు కాబుల్‌ను ఆక్రమించుకోవడానికి ముందు నుంచే కాల్పుల శబ్దాలు వినిపించాయని కాబుల్ పీస్ ఫోరం వ్యవస్థాపకుడు షరీఫ్ షఫీ పేర్కొన్నారు. తాను నివసించే ప్రదేశంలో ప్రతి అరగంటకు తుపాకులు, పేలుళ్ల శబ్దాలు వినిపించాయని, పరిస్థితులు అదుపు తప్పాయని, దేశం విడిచిపోవడం మినహా మరో మార్గం కనిపించట్లేదని ఆయన వ్యాఖ్యానించారు. తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని ఎవరూ అడ్డుకోలేరని, రక్తపాతానికి అవకాశం లేకుండా జరగాలని తాము కోరుకుంటున్నామని పేర్కొన్నారు.

ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘన్..

ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘన్..

దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లడంతో.. అక్కడి ప్రభుత్వం కుప్పకూలినట్టయింది. తాలిబన్లు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ పేరును ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్‌గా మార్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తోన్నాయి. అధికార మార్పిడి సజావుగా సాగడానికి మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, అబ్దుల్లా అబ్దుల్లా, ముజాహిదీన్ మాజీ నాయకుడు గులాబుద్దీన్ హెక్‌మట్యార్‌తో కూడిన ఓ సమన్వయ కమిటీ ఏర్పాటైంది.

రక్తపాతం లేకుండా..

రక్తపాతం లేకుండా..

రక్తపాతానికి ఏ మాత్రం అవకాశం లేకుండా అధికార బదలాయింపు సజావుగా సాగడానికి ఉద్దేశించిన కోఆర్డినేషన్ కమిటీ ఇది. తాలిబన్ల ప్రతినిధులతో చర్చించి.. ప్రభుత్వాన్ని వారి చేతుల్లో అప్పగించాలనేది ఈ కమిటీ ఆలోచన. మాట వినకుంటే బుల్లెట్‌ను దింపే తాలిబన్లు.. ఈ కమిటీ చేసిన ప్రతిపాదనలను పట్టించుకుంటాయా? అనే సందేహాలు వ్యక్తమౌతోన్నాయి. ఆ కోఆర్డినేషన్ కమిటీకి ఎలాంటి చట్టబద్ధత లేకపోవడం వల్ల తాలిబన్లు ఏకపక్షంగానే నిర్ణయాలను తీసుకునే అవకాశాలు లేకపోలేదు.

అమెరికా సైన్యం మోహరింపు..

అమెరికా సైన్యం మోహరింపు..

మరోవంక- అమెరికా తన సైన్యాన్ని పెద్ద ఎత్తున మోహరింపజేసింది. ఇప్పటికే ఆరువేల ట్రూపులను కాబుల్‌కు తరలించింది. ఈ సంఖ్యను మరింత పెంచుతామని ప్రకటించింది. రాయబార కార్యాలయ అధికారులు, ఉద్యోగులను సురక్షితంగా స్వదేశానికి తీసుకుని రావడానికి మాత్రమే తమ సైనిక బలగాలు పనిచేస్తాయని తెలిపింది. ప్రస్తుతం ఎంబసీ ఉద్యోగులందరూ కాబుల్ ఎయిర్ పోర్ట్‌లో సురక్షితంగా ఉన్నారని తెలిపింది. తాలిబన్లు కాబుల్‌ను ఇంత త్వరగా ఆక్రమించుకుంటారని అనుకోలేదని చెబుతోంది.

సరిహద్దులు ఓపెన్..

తాలిబన్ల పరిపాలనకు భయపడి దేశం విడిచి వెళ్తోన్న ఆఫ్ఘనిస్తాన్ పౌరుల కోసం పొరుగు దేశాలు తమ సరిహద్దులను తెరిచి ఉంచాలని అమెరికా విజ్ఙప్తి చేసింది. స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవించే హక్కు ఆఫ్ఘన్ పౌరులకు ఉందని, వారి రాకను అడ్డుకోవద్దని సూచించింది. తమ దేశంలో నివసించడానికి వచ్చే ఆఫ్ఘనిస్తాన్ పౌరుల కోసం ప్రత్యేక విసాలను మంజూరు చేస్తోన్నామని అమెరికా తెలిపింది. రెండు వారాల్లో స్పెషల్ విసాల కింద రెండువేల మంది ఇప్పటికే అమెరికాలో నివిస్తున్నట్లు తెలిపింది.

 తాలిబన్లకు అమెరికా కీలక సూచన

తాలిబన్లకు అమెరికా కీలక సూచన

ఆప్ఘనిస్తాన్‌లో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నద్ధమౌతో్న తాలిబన్లకు అమెరికా ప్రభుత్వం కొన్ని కీలక సూచనలు చేసింది. రక్తపాత రహితంగా అధికార మార్పడి జరగాలని పేర్కొంది. బాధ్యతాయుతంగా పరిపాలనను సాగించాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రజల ప్రాణాలు, ఆస్తులను పరిరక్షంచడానికి ప్రాధాన్యత ఇవ్వాలని, వారు తమకు ఇష్టమైన రీతిలో స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవించే హక్కును కల్పించాలని సూచించింది.

ఆఫ్ఘన్‌లో తాలిబన్ల పాలనపై బ్రిటన్..

ఆఫ్ఘన్‌లో తాలిబన్ల పాలనపై బ్రిటన్..

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పరిపాలనపై బ్రిటన్ కీలక వ్యాఖ్యలు చేసింది. తాలిబన్ల పరిపాలన ఆరంభం కావడానికి ఎంతో సమయం పట్టదని బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. ఆ పరిపాలన ఎలా ఉంటుందనేది అనేక అనుమానాలను లేవనెత్తుతోందని వ్యాఖ్యానించారు. ప్రజలకు స్వేచ్ఛనిచ్చేలా అక్కడి పాలన ఉండాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+