మాల్దీవుల అధ్యక్షుడికి పదవీ గండం- భారత్ వ్యతిరేకతే కొంపముంచిందా ?

భారత్ పొరుగుదేశం మాల్దీవులు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతోంది. మూడు నెలల క్రితం ఏర్పాటైన కొత్త ప్రభుత్వంలో మంత్రులు భారత ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని చేసిన విమర్శల తర్వాత మొదలైన సమస్యలు పలు మలుపులు తిరిగి ఇప్పుడు ఏకంగా అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జు పదవికే ఎసరుపెట్టేలా మారిపోయాయి. మొయిజును పదవి నుంచి అభిశంసించేందుకు వీలుగా విపక్షం మద్దతు కూడగడుతోంది.

మాల్దీవుల్లో కొలువుతీరిన కొత్త ప్రభుత్వం భారత్ వ్యతిరేక, చైనా అనుకూల వైఖరి కొనసాగిస్తుండంపై స్వదేశంలోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో 87 మంది సభ్యులున్న మాల్దీవుల పార్లమెంట్ మజ్లిస్ లో మెజార్టీ ఎంపీలు ఇప్పుుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిపోయారు. అధ్యక్షుడు మొయిజును ఎలాగైనా గద్దె దింపాలని భావిస్తున్న వీరంతా ఏకమై ఇప్పుడు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

after row with india, maldives president muizzu to face opposition impeachment motion soon

పార్లమెంట్ లో ప్రస్తుతం మెజార్టీ కలిగిన విపక్ష పార్టీ మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ (ఎండీపీ), ఇతర విపక్షాలను కూడగట్టి అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు సంతకాల సేకరణ కూడా చేపట్టింది.
మజ్లిస్ (మాల్దీవుల పార్లమెంటు) సభ్యులు మొయిజు క్యాబినెట్‌లోని నలుగురు సభ్యుల ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ మొదలుపెట్టిన వివాదం అనేక మలుపులతో ఇప్పుడు అధ్యక్షుడి పదవికే ఎసరుపెట్టేదాకా వచ్చింది.

మాల్దీవియన్ డెమొక్రాటిక్ పార్టీ, డెమొక్రాట్‌ల పార్లమెంటరీ బృందం ఓటింగ్‌కు ముందు అధ్యక్షుడు ముయిజు మంత్రివర్గంలోని నలుగురు సభ్యులకు పార్లమెంటరీ ఆమోదం నిలిపివేయాలని నిర్ణయించింది. అధికార పార్టీ ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్, పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ కి చెందిన ప్రభుత్వ అనుకూల ఎంపీలు దీనిపై నిరసనకు దిగడంతో పార్లమెంట్‌లో గొడవ జరిగింది. ఇది కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మాల్దీవుల రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడిని తొలగించాలంటే ముందుగా పార్లమెంట్లో మూడో వంతు మంది ఎంపీలు తీర్మానం ఇవ్వాలి. ఆ తర్వాత జరిగే ఓటింగ్ లో ఈ తీర్మానం మూడింట రెండొంతుల మద్దతు పొందాలి. ప్రస్తుతం 80 మంది ఎంపీలు మాత్రమే ఉన్న మజ్లిస్ (పార్లమెంట్)లో విపక్ష ఎండీపీ, డెమోక్రాట్ లకు 56 మంది ఎంపీలున్నారు. వీరంతా ఇప్పుడు అధ్యక్షుడి అభిశంసనపై సంతకాలు చేశారు. మెజార్టీకి 54 సంతకాలు సరిపోతాయి.

ఈ నేపథ్యంలో తమ మద్దతు పత్రాల్ని ఎంపీలు పార్లమెంట్ కు సమర్పించాలి. అనంతరం అధ్యక్షుడికి సమాధానం కోసం 14 రోజులసమయం ఇస్తారు. ఆ తర్వాత 15వ రోజు గంట సమయం ఇస్తారు. తర్వాత జరిగే ఓటింగ్ లో 54 మంది అభిశంసనకు అనుకూలంగా ఓటు వేస్తే ఆయన పదవిని కోల్పోతారు. అప్పుడు ఉపాధ్యక్షుడు అధ్యక్ష బాధ్యతలు చేపడతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+