ఉక్రెయిన్ పై పోరులో షాకులు- వాలంటీర్ల సాయం కోరిన పుతిన్- ఆయుధాలిస్తామంటూ

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలుపెట్టి 16 రోజులవుతోంది. అయినా ఆ దేశంపై రష్యాకు పట్టు చిక్కడం లేదు. మధ్యలో అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఒత్తిడితో చర్చల పేరుతో పుతిన్ కాలయాపన చేయక తప్పడం లేదు. దీంతో ఉక్రెయిన్ పై మొదలుపెట్టిన పోరు విషయంలో ప్రపంచ దేశాల నుంచి పుతిన్ పై విమర్శలతో పాటు ఆంక్షలు కూడా పెరిగిపోతున్నాయి. మరోవైపు ఉక్రెయన్ లో తన బలగాలకు తలుగుతున్న ఎదురుదెబ్పలు దీనికి అదనంగా మారాయి. ఈ నేపథ్యంలో పుతిన్ వాలంటీర్ల సాయం కోరారు.

మధ్యప్రాచ్య దేశాలకు చెందిన వాలంటీర్ ఫైటర్లను ఉక్రెయిన్ తో పోరులో సాయం చేయాలని పుతిన్ కోరారు. పోరుకు ముందుకొచ్చే వారికి ఆయుధాలిస్తామని ఆఫర్ చేశారు. దీంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. పుతిన్ విజ్ఞప్తికి వాలంటీర్ ఫైటర్ల నుంచి సానుకూల స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సాధ్యమైనంత త్వరగా చెచెన్యాతోపాటు మరికొన్ని దేశాలకు చెందిన ఫైటర్లను ఉక్రెయిన్ రప్పించేందుకు రష్యా ప్రయత్నాలు మొదలుపెట్టింది.

after setbacks in ukraine, now Putin ask for Middle East volunteer fighterss support

రష్యా-మద్దతుగల తిరుగుబాటుదారులతో పాటు మధ్యప్రాచ్యం నుండి 16 వేల మంది వాలంటీర్లను మోహరించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం గ్రీన్ లైట్ ఇచ్చారు. దీంతో ఉక్రెయిన్ లో రష్యా సాగిస్తున్న పోరు పస తగ్గుతోందని చేస్తున్న విమర్శలకు కౌంటర్ గా తీసుకున్న చర్యగానే కనిపిస్తోంది. పౌరులు నగరాన్ని విడిచిపెట్టడానికి "మానవతా కారిడార్" విజయవంతంగా తెరుస్తారని ఉక్రేనియన్ మంత్రి ఆశాభావం వ్యక్తం చేయడంతో, రష్యా దళాలు మారియుపోల్ ఓడరేవు నగరంపై తమ బాంబు దాడులను కొనసాగించాయి.మరోవైపు తాజా ఉపగ్రహ ఛాయాచిత్రాలు 64-కిమీ వాహనాలు, ట్యాంకులు, ఫిరంగిదళాల కాన్వాయ్ విచ్ఛిన్నమై, నగరానికి ఉత్తరాన ఉన్న ఆంటోనోవ్ విమానాశ్రయానికి సమీపంలోని పట్టణాలలో సాయుధ యూనిట్లు కనిపించాయని చెబుతోంది. కొన్ని వాహనాలు అడవుల్లోకి వెళ్లాయని మాక్సర్ నివేదిక తెలిపింది.

అటు ఉక్రెయిన్‌తో చర్చల్లో కొంత పురోగతి ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. రష్యా ఆందోళనను తగ్గించేందుకు పశ్చిమ దేశాలు చర్య తీసుకున్నప్పుడు మాత్రమే వివాదం ముగుస్తుందన్నారు. బెలారసియన్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకోతో క్రెమ్లిన్ సమావేశంలో, పుతిన్ పాశ్చాత్య ఆంక్షలు రష్యా అభివృద్ధికి ఆటంకం కలిగించవని, వాటితో రష్యా మరింత బలపడుతుందని అన్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఉక్రెయిన్ చర్చలు ప్రతిరోజూ ఆచరణాత్మకంగా జరుగుతున్నాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+