కాలిఫోర్నియాలో భారీ భూకంపం.. రెండు దశాబ్ధాల తర్వాత తీవ్రస్థాయిలో ప్రకంపనాలు
రిజ్డ్ క్రెస్ట్ : కాలిఫోర్నియాలో భారీ భూకంపం సంభవించింది. రెండు దశాబ్ధాల తర్వాత దక్షిణ కాలిఫోర్నియాలో తీవ్రంగా భూమి కంపించింది. దీంతో దాదాపు 1400 మందికి పైగా ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.1గా నమోదైంది. ఉత్తర్ లాస్ ఏజెల్స్‌కు 240 కిలోమీటర్ల దూరంలో రిజ్డ్ క్రెస్ట్ వద్ద భూకంపం తీవ్ర ప్రభావం చూపింది.
అత్యవసర పరిస్థితి ..
దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత తీవ్రస్థాయిలో భూకంపం సంభవించడంతో అధికారులు అప్రమత్తమయయారు. భూకంపంతో కాలిఫోర్నియా గవర్నర్ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి విధించారు. రిజ్డ్ క్రెస్ట్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో కూడా భూకంపం ప్రభావం చూపింది. కొన్నిచోట్ల భూమి పగులు కనిపించిందని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. తొలుత శుక్రవారం రిజ్ట్ క్రెస్ట్‌లో 5.4 తీవ్రతగా రికార్డైందని .. తర్వాత దాని తీవ్రత 7.1కు చేరిందని పేర్కొన్నారు.

భయం.. భయం ...
భూకంపాన్ని ప్రత్యక్షంగా చూసిన స్థానికులు తమకు చూస్తుంది సినిమానా .. లేదా నిజమో అర్థం కాలేదన్నారు. కళ్లముందే భూమి కదులడం, ప్రకంపనల తీవ్రతతో పగులు రావడం, ఎక్కడి వస్తువులు చెల్లాచెదురుగా పడిపోవడంతో భయాందోళనకు గురయ్యామని సారా పేర్కొన్నారు. మరికొన్ని చోట్ల మంచినీటి పైపులు పగిలిపోయాయి. భూకంపంతో హట్‌లైన్ ఏర్పాటు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. దాని ద్వారా ప్రజలను త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలించవచ్చని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications