Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తప్పిన పెను ప్రమాదం ? తప్పతాగి ఎయిరిండియా పైలట్-టేకాఫ్ వేళ..!

గతేడాది అహ్మదాబాద్-లండన్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో 260 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మర్చిపోకముందే తాజాగా అలాంటిదే మరో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్ ఇండియా విమానం నడిపేందుకు నియమించిన పైలట్ తప్పతాగి కాక్ పిట్ లోకి వెళ్తుండగా.. గుర్తించిన అధికారులు అతనికి మద్యం పరీక్షలు నిర్వహించగా ఫెయిలయ్యాడు. దీంతో వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని మరో పైలట్ సాయంతో విమానం సురక్షితంగా టేకాఫ్ చేయించారు.

గత నెల 23న కెనడాలోని వాంకోవర్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ186ను నడిపేందుకు సిద్ధమైన పైలట్.. అంతకు ముందే ఎయిర్ పోర్టులో వైన్ కొనుగోలు చేసి తాగుతున్నట్లు కొందరు గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు పైలట్ ను చేరుకున్నారు. కాసేపట్లో విమానం టేకాఫ్ అవుతుందనగా.. సదరు పైలట్ మద్యం తాగారో లేదో నిర్ధారించుకునేందుకు పరీక్షలు నిర్వహించారు. ఇందులో అతను ఫెయిల్ కావడంతో వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

Air India pilot offloaded after smell test just before takeoff in Canada

భద్రతా ప్రోటోకాల్‌ల ప్రకారం, విమానాన్ని నడపడానికి ప్రత్యామ్నాయ పైలట్‌ను నియమించినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రత్యామ్నాయ పైలట్‌ను గుర్తించి కేటాయించే ప్రక్రియకు అదనపు సమయం అవసరం కావడంతో విమాన ప్రయాణం ఆలస్యమైనట్లు తెలుస్తోంది. దీనిపై ఎయిర్ ఇండియా క్షమాపణలు తెలిపింది. ఈ వ్యవహారంలో కెనడా అధికారులకు సహకరించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపింది. అంతే కాదు సదరు పైలట్ ను విధుల నుంచి తప్పించినట్లు కూడా తెలిపింది.
ఇలాంటి ఉల్లంఘనలు జరిగితే కంపెనీ విధానానికి అనుగుణంగా కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఇతర పైలట్లకు హెచ్చరికలు చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+