పాకిస్థాన్ దెబ్బకు ఎయిర్ ఇండియా విలవిల.. కీలక నిర్ణయం దిశగా..!

భారత్- పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. గతేడాది పహల్గా ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇరు దేశాల మధ్య గగనతలం మూసివేత ప్రారంభమైంది. భారత్ నుంచి ప్రయాణించే విమానాలకు అలాగే భారత్ కు వచ్చే విమానాలకు పాకిస్థాన్ తన గగనతలాన్ని మూసివేసింది. అయితే పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఓ వైపు ఎయిర్ ఫ్యూయల్ ధరలు పెరగడం మరోవైపు పాకిస్థాన్, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఎయిర్ ఇండియా సంస్థ ఆపరేషనల్ అలాగే ఫైనాన్షియల్ సమస్యలను ఎదుర్కుంటోందని ఎయిర్ ఇండియా సీఈఓ అండ్ ఎండీ టెవోల్డే గెబ్రెమేరియమ్ తాజాగా స్పష్టం చేశారు.

" పాకిస్థాన్ గగనతలం మూసివేత కారణంగా ఆ ప్రభావం ఎయిర్ ఇండియాపై ప్రత్యక్షంగా పడింది. అయితే మా పోటీదారులతో పోల్చితే దాని ప్రభావం మా పైనే అధికంగా ఉంది. కానీ ఈ సమస్యలు అన్నీ కొద్ది రోజులు మాత్రమే ఉంటాయని ఆశిస్తున్నా. ఆ తర్వాత మనం మరింత శక్తివంతంగా మారేందుకు అవకాశం ఉంది. అలాగే లాంగ్ టర్మ్ ఫ్యూచర్ గ్రోత్ కు కూడా అవకాశం ఉంది" అని టెవోల్డే తెలిపారు. అలాగే ఇంధన ధరలు గణనీయంగా పెరగడం వైమానిక సంస్థలను మరింత ఆందోళన కలిగించే అంశం అని పేర్కొన్నారు. సంవత్సరం క్రితం కంటే ఇప్పడు ఫ్యూయెల్ ధరలు డబుల్ రేంజ్ లో పెరిగాయని అన్నారు. ఎయిర్ స్పేస్ బ్యాన్ లు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఫ్యూయల్ ధరలు పెరగడం తదితర కారణాలతో ఎయిర్ ఇండియా సంస్థ తన నెట్ వర్క్ ను రీ క్యాలిబ్రేట్ చేసుకుంటుందని తన ఆపరేషన్స్ పై సమీక్ష నిర్వహిస్తోందని అన్నారు.

AirIndia impacted by Pakistan airspace ban CEO cites Middle East tensions as another big factor

అలాగే ఎయిర్ ఇండియా తమ కార్యకలాపాలను దేశ రాజధాని దిల్లీ కంటే ముంబై నుంచి అధికంగా నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్లు టెవోల్డే స్పష్టం చేశారు. దిల్లీ ముఖ్యమైన హబ్ గా ఉన్నా యూరోప్, అమెరికాకు సంబంధించిన ఆపరేషన్స్ ను ముంబై నుంచే కొనసాగించాలని ఎయిర్ ఇండియా ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఎయిర్ స్పేస్ నిబంధనల కారణంగా ముంబై కంటే దిల్లీనే అధికంగా ప్రభావితం అవుతూందని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+