కిమ్ జోంగ్ సోదరుడి హత్య: ‘కిమ్ కుట్ర’ వీడియో ప్రదర్శన, కోర్టుకు నిందితులు

Subscribe to Oneindia Telugu

కౌలాలంపూర్: ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జంగ్‌ ఉన్‌ సోదరుడు కిమ్ జోంగ్ నామ్ హత్య కేసులో నిందితులను కౌలాలంపూర్‌ పోలీసులు షా అలం కోర్టులో ప్రవేశపెట్టారు. కిమ్‌ జోంగ్‌ నామ్‌ను హత్యకు సంబంధించి ఎయిర్‌ పోర్టులో లభించిన పుటేజీ ఆధారంగా ఇండోనేషియా, వియత్నాంలకు చెందిన ఇద్దరు మహిళలపై, నలుగురు పురుషులపై మలేషియా పోలీసులు ఆరోపణలు నమోదు చేశారు.

 Airport video shows North Korean embassy official with Kim Jong Nam murder suspects

సిటి ఐషా, డోన్‌ తి రియాల్టీ షో అంటూ ఫ్రాంక్ వీడియో పేరిట నామ్‌పై దాడి చేశారంటూ డిఫెన్స్‌ న్యాయవాది వాదించారు. ఇక వీరితో మాట్లాడిన వారు ఉత్తర కొరియా వాసులేనన్న విషయం అధికారులు ధృవీకరించారు. అందులో ముగ్గురు వ్యక్తులు ఘటన జరిగిన గంట తర్వాత ఉత్తర కొరియా దౌత్యవేత్త, ఎయిర్ కోర్యో అధికారులతో మాట్లాడటం కూడా రికార్డైంది.

పెనుముప్పే, సహనం నశించింది: కిమ్ జోంగ్‌పై ట్రంప్ ఆగ్రహం, జపాన్ ఫుల్ ‌సపోర్ట్

కిమ్‌ కుట్రగా అభివర్ణిస్తున్న ఆ వీడియోను కోర్టు హాల్లో మొత్తం ప్రదర్శించారు. కిమ్‌ పాలనను తప్పు బట్టిన ఆయన సోదరుడు నామ్‌, తర్వాత మకావ్‌కు శరణార్థిగా వెళ్లాడు. ఫిబ్రవరి 13న కిమ్‌ జంగ్‌ నామ్‌ను రసాయన ఆయుధం వీఎక్స్‌ తో కొందరు దుండగులు మలేషియన్‌ ఎయిర్‌పోర్టులో హతమార్చిన విషయం తెలిసిందే. కాగా, ఆ ఆరోపణలను ఖండించిన ఉత్తర కొరియా.. అప్పటి నుంచి మలేషియాతో దౌత్య సంబంధాలను తెంచేసుకుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A North Korean embassy official and a manager of Air Koryo, the national airline, met suspects wanted for the killing of Kim Jong Nam shortly after the murder, according to video recordings shown at the trial in Kuala Lumpur on Monday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి