డెమోక్రాట్లు గెలిస్తే నా పవర్ చూపిస్తా.. ప్రత్యర్థులకు ట్రంప్ స్ట్రాంగ్ మెసేజ్!

వచ్చే మధ్యంతర ఎన్నికల్లో ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ గనుక కాంగ్రెస్‌లోని ఏదైనా ఒక సభలో లేదా రెండింటిలోనూ మెజార్టీ సాధిస్తే తాను 'మిస్టర్ వీటో'గా మారతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. డెమోక్రాట్లు తీసుకొచ్చే బిల్లులను తన వీటో అధికారంతో తిరస్కరిస్తూ.. వారిని చర్చల వేదికపైకి తెచ్చి ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఈ వ్యూహాన్ని ఉపయోగిస్తానని ట్రంప్ స్పష్టం చేశారు.

ట్రంప్ కు అమెరికా కోర్టులో ఎప్ స్టీన్ షాక్..! వాల్ స్ట్రీట్ వివాదంలో..!
ట్రంప్ కు అమెరికా కోర్టులో ఎప్ స్టీన్ షాక్..! వాల్ స్ట్రీట్ వివాదంలో..!

ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'పాడ్ ఫోర్స్ వన్' పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. డెమోక్రాట్ల చేతికి కాంగ్రెస్ అధికారాలు వెళ్తే దేశ ప్రగతిని దెబ్బతీసే అవకాశం ఉందని, అందుకే తాను వీటో అధికారాలను వరుసగా ఉపయోగిస్తానని చెప్పారు. ఒకవేళ డెమోక్రాట్లు గెలిస్తే తాను 'మిస్టర్ వీటో'గా మారతానని, వారు పంపే ప్రతి బిల్లును తిరస్కరిస్తూ పోతానని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఒకటి లేదా రెండు నెలల పాటు వారు తీసుకొచ్చే బిల్లులన్నీ తిరస్కరణకు గురయ్యాక.. సమయం వృథా అవుతుందని గుర్తించి వారే తన వద్దకు వచ్చి ఒప్పందం కుదుర్చుకుంటారని, గతంలోనూ ఇలాంటి ఒప్పందాలు జరిగాయని ట్రంప్ వివరించారు.

America President Donald Trump Warns Democrats Says He Will Become Mr Veto If They Win Midterms

మూడోసారి అధ్యక్ష పోటీపై స్పష్టత
ఇదే ఇంటర్వ్యూలో మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం ఉందా అని అడగగా.. రాజ్యాంగ నిబంధనలు దానికి అంగీకరించవని డొనాల్డ్ ట్రంప్ సమాధానమిచ్చారు. అవకాశం ఉంటే మళ్లీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, కానీ అమెరికా రాజ్యాంగంలోని 22వ సవరణ ప్రకారం ఓ వ్యక్తి రెండు కంటే ఎక్కువ సార్లు అధ్యక్షుడిగా ఎన్నిక కాకూడదనే కచ్చితమైన రూల్ ఉందని గుర్తు చేశారు.

10 నిమిషాల్లో లేపేస్తాం: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
10 నిమిషాల్లో లేపేస్తాం: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

నవంబర్ 3న అమెరికా మధ్యంతర ఎన్నికలు
అమెరికా వ్యాప్తంగా నవంబర్ 3, మంగళవారం రోజున మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లోని మొత్తం 435 స్థానాలకు, అలాగే సెనేట్‌లోని 100 స్థానాలకు గాను 35 స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. ప్రస్తుతం హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో రిపబ్లికన్లకు స్వల్ప మెజార్టీ ఉంది. డెమోక్రాట్లు హౌస్ నియంత్రణను తిరిగి చేజిక్కించుకోవడానికి మరో 3 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంది.

అధ్యక్షుడి వీటో అధికారం అంటే ఏమిటి?
అమెరికా రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్ చట్టసభలు(హౌస్, సెనేట్) ఆమోదించి పంపిన ఏ చట్టాన్ని లేదా బిల్లును అయినా రద్దు చేసే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. దీనినే వీటో అధికారం అంటారు. అయితే కాంగ్రెస్‌లోని రెండు సభల్లోనూ మూడింట రెండు వంతుల మెజార్టీతో చట్టసభ్యులు మళ్లీ ఆ బిల్లును ఆమోదిస్తే అధ్యక్షుడి వీటోను అధిగమించి చట్టం చేయవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+