వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా ఎన్నికల్లో ఆంధ్రా మహిళ : వర్జీనియా నుంచి రిపబ్లికన్ అభ్యర్థిగా మంగా అనంతత్మూలా

|
Google Oneindia TeluguNews

Recommended Video

Evening News Express: 3 Minutes 10 Headlines | Storm Ciara In UK | AP woman Manga Anantatmula

వర్జీనియా: ఈ ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్షుడి పీటంపై కూర్చునేందుకు వ్యూహాలను రచిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే అభిశంసన తీర్మానం ఎదుర్కొన్న ట్రంప్... అందులో గట్టెక్కారు. ఇక పూర్తిగా రానున్న ఎన్నికలపైనే ట్రంప్ దృష్టి సారించారు. అమెరికా కాంగ్రెస్ ఎన్నికల్లో వర్జీనియా రాష్ట్రం నుంచి రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా మంగా అనంతత్మూలా అనే మహిళ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆమె ప్రచారం ప్రారంభించారు.

రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలో మంగా అనంతత్మూలా

రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలో మంగా అనంతత్మూలా

జనవరి 26వ తేదీన మంగా అనంతత్మూలా రిపబ్లికన్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. వర్జీనియా నుంచి రిపబ్లికన్ తరపున పోటీచేస్తున్న తొలి ఇండో అమెరికన్‌గా మంగా గుర్తింపుపొందారు. వర్జీనియా డెమొక్రాట్ల కంచుకోటా ఉంటోంది. వర్జీనియాలో 17శాతం ఆసియా దేశాలకు చెందిన జనాభా ఉండగా అందులో 7శాతం మంది భారత్‌కు చెందిన వారు ఉన్నారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె డిఫెన్స్ అక్విజిషన్ ప్రోగ్రాంలో ఉద్యోగిగా పనిచేశారు.

 ఆంధ్రాలో జన్మించిన మంగా అనంతత్యూలా

ఆంధ్రాలో జన్మించిన మంగా అనంతత్యూలా

ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన మంగా అనంతత్మూలా చెన్నైలో పాఠశాల విద్యను అభ్యసించారు. అనంతరం ఆగ్రా యూనివర్శిటీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. 1990లో ఆమె తన భర్త కుమారుడితో అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. సాధారణంగా అమెరికాలో స్థిరపడ్డ ఆసియా దేశాల వారు ముఖ్యంగా భారతీయులు డెమొక్రాట్ అభ్యర్థులకే మద్దతుగా నిలుస్తారు. అయితే ఈ ట్రెండును తాను మార్చగలననే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు మంగా. గత ఆరు పర్యాయాలుగా పదవిలో ఉన్న గ్రే కొనోలీపై ఈ సారి విజయం సాధిస్తానని చెబుతున్నారు మంగా అనంతత్మూలా.

 రిపబ్లికన్ పార్టీ తీర్థం తీసుకుంటున్న డెమొక్రాట్లు

రిపబ్లికన్ పార్టీ తీర్థం తీసుకుంటున్న డెమొక్రాట్లు

ఇక అసంతృప్తి రాజకీయాలు అమెరికాలో కూడా బాగానే ఉన్నాయి. చాలామంది డెమొక్రటిక్ పార్టీ నాయకులు అధికారిక రిపబ్లికన్ పార్టీలోకి జంప్ అవుతున్నట్లు సమాచారం. ప్రస్తుత రాజకీయ పరిస్థితి, ట్రంప్ తీసుకుంటున్న విధానాపరమైన నిర్ణయాలు సక్సెస్ అవడంతో అతనికి మద్దతుగా నిలిచేందుకే రిపబ్లికన్ పార్టీ వైపు డెమొక్రాట్లు చూస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇక తన ప్రచారంలో భాగంగా ట్రంప్ తీసుకొచ్చిన విధానాలను మంగా అనంతత్మూలా హైలైట్ చేస్తున్నారు.

పలు అంశాలే ప్రధాన అస్త్రాలుగా వినియోగిస్తున్న మంగా

పలు అంశాలే ప్రధాన అస్త్రాలుగా వినియోగిస్తున్న మంగా

మంగా అని ఇంగ్లీషులో ఉన్న తనపేరును కూడా "మేకింగ్ అమెరికన్స్ గ్రేట్ అగెయిన్ " (MANGA)అని విశదీకరించుకున్నారు. ఇక పన్నులను తగ్గించడం, మహిళలకు సమాన హక్కులు, చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలను వృద్ధిలోకి తీసుకురావడం, అందుబాటులో వైద్యంలాంటి అంశాలపై మంగా దృష్టి సారించారు. ఆసియా దేశాల వారికి స్కూళ్లల్లో అడ్మిషన్లు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ మంగా తన గళాన్ని వినిపించారు. అప్పటి నుంచి ఆమె ప్రధాన వార్తల్లో నిలుస్తూ వచ్చారు. తనను గెలిపించి అధికారంలోకి తీసుకొస్తే భారత్ అమెరికా సంబంధాల బలోపేతానికి తాను మరింత కృషి చేస్తానని చెప్పుకొచ్చారు మంగా అనంతత్మూలా.

English summary
An Indian-American woman, who raised her voice against alleged discrimination in the admission of Asians in IV League schools, has announced that she will run for the US House of Representatives, saying she wants to be a “voice, not a noise” for the community particularly the Hindus in the US.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X