Andy Burnham: యూకే కొత్త ప్రధానిగా ఆండీ బర్న్ హామ్- లేబర్ పార్టీ నేతగా ఎన్నిక..!

బ్రిటన్ కు కాబోయే ప్రధాని ఎవరో తేలిపోయింది. అధికార లేబర్ పార్టీ నాయకుడిగా ఆండీ బర్న్ హామ్ (Andy Burnham) ఖరారయ్యారు. ప్రస్తుత ప్రధాని కీర్ స్టార్మర్ స్ధానంలో కొత్త ప్రధానిగా ఆయన సోమవారం బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఎన్నికల ఫలితాలు, ప్రజా మద్దతు తగ్గడంపై లేబర్ పార్టీలో పెరిగిన ఒత్తిడి కారణంగా కీర్ స్టార్మర్ ఈ వారంలోనే రాజీనామా చేశారు. దీంతో ఇప్పటివరకూ గ్రేటర్ మాంచెస్టర్ మాజీ మేయర్, సుదీర్ఘకాలంగా లేబర్ పార్టీలో కొనసాగుతున్న రాజకీయ నాయకుడైన బర్న్‌హామ్ పార్టీ నాయకత్వాన్ని దక్కించుకున్నారు.

US-Iran War: మళ్లీ ఇరాన్ పై వార్ - కాంగ్రెస్ కు ట్రంప్ నోటీసు..!
US-Iran War: మళ్లీ ఇరాన్ పై వార్ - కాంగ్రెస్ కు ట్రంప్ నోటీసు..!

లండన్‌లో జరిగిన పార్టీ ప్రత్యేక సమావేశంలో లేబర్ పార్టీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ (NEC) చైర్ పర్సన్ షబానా మహమూద్ ఈ విషయాన్ని ప్రకటించారు.నామినేట్ అయిన ఎంపీ ఒక్కరే ఉన్నారని, కాబట్టి ఇది ఏమాత్రం ఉత్కంఠభరితమైన పోటీ కాదని ఆమె తెలిపారు. సోమవారం పదవీ విరమణ చేస్తున్న ప్రధాని కీర్ స్టార్మర్.. బ్రిటన్ రాజుకు తన రాజీనామాను అధికారికంగా సమర్పించిన తర్వాత, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కింగ్ చార్లెస్ III బర్న్‌హామ్‌ను ఆహ్వానిస్తారు.

Andy Burnham to Succeed Keir Starmer as UK Prime Minister on Monday
సింధు జలాల వివాదంలో బిగ్ ట్విస్ట్..! భారత్ బిల్లూ భరిస్తున్న పాకిస్తాన్ ..!
సింధు జలాల వివాదంలో బిగ్ ట్విస్ట్..! భారత్ బిల్లూ భరిస్తున్న పాకిస్తాన్ ..!

లేబర్ పార్టీ నాయకుడిగా ఉండటం తన జీవితంలోనే ఒక గొప్ప గౌరవమని ఈ ఎన్నిక అనంతరం ఆండీ బర్న్ హామ్ ట్వీట్ చేశారు. ఈ గొప్ప దేశంలోని ప్రతి ప్రాంతానికి, ప్రతి దేశానికి తాను నాయకుడిగా ఉంటానన్నారు. అలాగే, తమ ప్రాధాన్యతలు, నిర్ణయాల విషయంలో ఈ పార్టీ ఎటువంటి సంకోచం లేకుండా 'లేబర్' విధానాలకు కట్టుబడి ఉంటుందని వెల్లడించారు. మనమందరం కలిసి బ్రిటన్‌ను ఒక కొత్త మార్గంలో నడిపిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+