థాయ్‌లో బాంబు పేలుళ్లు: ఇద్దరు మృతి, 40మందికి గాయాలు
బ్యాంకాక్: థాయ్‌లాండ్ వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. పట్టాని ప్రావిన్స్‌లోని సదరన్ హోటల్ పార్కింగ్ ప్రాంతంలోనూ, హోటల్ ప్రవేశ ద్వారం వద్ద ఉంచిన ట్రక్కులోనూ మంగళవారం రాత్రి బాంబులు పేలాయి.
ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. రెండు వారాల క్రితం జరిగిన బాంబు పేలుళ్లలో నలుగురు చనిపోగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే.

థాయ్‌లాండ్‌కు 10% శాతానికిపైగా ఆదాయం పర్యాటక రంగం నుంచే వస్తోంది. తరుచూ బాంబు పేలుళ్ల ఘటనలు జరుగుతుండటంతో ఆ ప్రభావం పర్యాటకంపై పడుతుందని ప్రభుత్వంతోాపటు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications