Maldives: మాల్దీవుల ఎన్నికల్లో సంచలనం-భారత్ వ్యతిరేక అధ్యక్షుడికే మళ్లీ పగ్గాలు..!
ద్వీపదేశం మాల్దీవుల ప్రజలు సంచలన తీర్పు ఇచ్చారు. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారత్ వ్యతిరేక, చైనా అనుకూల అధ్యక్షుడిగా పేరు తెచ్చుకున్న అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ మరోసారి ఘన విజయం సాధించింది. గతేడాది భారత ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో ముయుజ్జు తిరిగి ఎన్నిక కావడం కష్టమని అంతా భావించారు. కానీ మాల్దీవులు ప్రజలు మాత్రం భిన్నంగా ఆలోచించారు.
మాల్దీవుల పార్లమెంట్ కు తాజాగా జరిగిన ఎన్నికల్లో ముయిజ్జు పార్టీ పీపుల్స్ నేషనల్ పార్టీ భారీ విజయం సాధించింది. మాల్దీవుల పార్లమెంట్ మజ్లిస్ కు జరిగిన ఎన్నికల్లో మొత్తం 93 సీట్లకు గానూ 90 సీట్లలో పోటీ చేసిన పీఎన్పీకి ఇప్పటివరకూ ప్రకటించిన 86 స్ధానాల్లో 66 స్ధానాలు దక్కాయి. అంటే పార్లమెంటులో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మూడోంతుల మెజారిటీ లభించినట్లే. దీంతో ముయిజు మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు.

ఈ ఫలితం భారత వ్యతిరేకిగా భావించే అధ్యక్షుడు ముయిజ్జూ పార్లమెంటులో తన విధానాలను వేగంగా ముందుకు తీసుకురావడానికి వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు. గత సంవత్సరం అధ్యక్షుడు ముయిజ్జు అత్యున్నత పదవికి ఎన్నికైనప్పటి నుంచీ చైనావైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో మాల్దీవుల ప్రజల తీర్పు చైనాకు సంతోషాన్ని ఇచ్చింది. అలాగే భారత్ కు షాకిచ్చింది. ముఖ్యంగా మోడీపై వ్యాఖ్యల తర్వాత ఈ చిన్న దీశంపై భారత్ స్పందించిన తీరు అక్కడి ప్రజల్లో సెంటిమెంట్ ను రాజేసినట్లు ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications