విద్యార్థి కాల్పులు: ఇద్దరి మృతి, 20 మంది బందీలు
మాస్కో: ఓ హైస్కూల్ విద్యార్థి విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఒక టీచర్, పోలీసు అధికారి మృతి చెందారు. తరువాత తరగతి గదిలోకి ప్రవేశించి 20 మంది విద్యార్థులను నిర్బంధించాడు. కొద్ది రోజుల్లో వింటర్ ఒలింపిక్స్ జరగనుండగా సోమవారం చోటుచేసుకున్న ఘటన ఆందోళన కలిగింది.
ఉత్తర మాస్కోలోని ఓ పాఠశాల బయోలజీ క్లాస్ రూమ్‌లోకి పిస్టల్‌తో వచ్చిన విద్యార్థి భీతావహ వాతావరణాన్ని సృష్టించాడు. కాల్పుల్లో ముందుగా ఓ పోలీసు అధికారి చనిపోయినట్టు లైఫ్‌న్యూస్ వెబ్‌సైట్ వెల్లడించింది. తరగతి గదిలోకి వచ్చి విచక్షణా రహితంగా కాల్పులు జరపగా టీచర్ మృతి చెందారు.

క్లాసులో ఉన్న ఇరవై మంది విద్యార్థులు, ఒక టీచర్‌ను నిర్బంధించాడని రష్యా అంతరింగక భద్రతా మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఆండ్రీ ఫిలిప్చుక్ తెలిపారు. అగంతకుడిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. పరిస్థితి సద్దుమణిగిన తరువాత విద్యార్థులను విడుదల చేసినట్టు ఆయన చెప్పారు.
ఈ ఆపరేషన్‌లో ఒక పోలీసు తీవ్రంగా గాయపడ్డాడు. మరొక అధికారి ఆసుప్రతిలో చనిపోయినట్టు న్యూస్‌లైన్ పేర్కొంది. మాస్కోలోని స్కూల్ నెంబర్ 263లో ఈ ఘటన జరిగిందన్నారు. కాల్పులతో భయాందోళనకు గురైన డజన్లకొద్ది విద్యార్థులు బయటకు పరుగులు తీశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications