మిలిటెంట్లతో హోరాహోరీ పోరు... 50 మంది పోలీసుల మృతి
ఈజిప్టులోని గజా నగరంలో మిలిటెంట్లతో జరిగిన పోరులో 50 మందికి పైగా పోలీసులు మృతిచెందారు. నగర సమీపంలోని ఎల్-వహాత్ ఎడారి ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. అక్కడి బహరియా ఓయాసిస్ వద్ద ఉగ్రవాదులు దాగి ఉన్
కైరో: ఈజిప్టులోని గజా నగరంలో మిలిటెంట్లతో జరిగిన పోరులో 50 మందికి పైగా పోలీసులు మృతిచెందారు. నగర సమీపంలోని ఎల్-వహాత్ ఎడారి ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది.
అక్కడి బహరియా ఒయాసిస్ వద్ద ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారం రావడంతో పోలీసులు, భద్రతా సిబ్బంది అక్కడకు వెళ్లారు. తనిఖీలు చేస్తుండగా.. వారిపైకి మిలిటెంట్లు హఠాత్తుగా కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో 50 మందికి పైగా పోలీసులు, భద్రతా సిబ్బంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరికొందరు గాయపడ్డారు. ఎదురుకాల్పుల్లో కొందరు ముష్కరులు కూడా హతమైనట్లు ఈజిప్టు హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అయితే ఎంత మంది మిలిటెంట్లు చనిపోయారు, వారి వివరాలను మాత్రం వెల్లడించాలేదు. మరోవైపు పోలీసులు, భద్రతా బలగాలపై కాల్పులకు పాల్పడింది తామేనంటూ తీవ్రవాద సంస్థ హసమ్ ప్రకటించింది.
ఇటీవలి కాలంలో ఈజిప్టులో భద్రతా సిబ్బందిపై మిలిటెంట్ దాడులు ఎక్కువయ్యాయి. 2013లో మహ్మద్ మోర్సీని ఈజిప్టు అధ్యక్షుడిగా తొలగించినప్పటి నుంచి ఆర్మీ, పోలీసులపై మిలిటెంట్లు తరచూ దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడుల్లో వందల సంఖ్యలో పోలీసులు, సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications