పెళ్లికి వెళ్లారు: విమానం కూలి 8 మంది దుర్మరణం

Posted By:
Subscribe to Oneindia Telugu

బ్రెజిల్: శుభకార్యానికి వెళ్లి తిరుగి గమ్యం చేరుకుంటున్న వారు ప్రమాదంలో సజీవదహనం అయిన సంఘటన బ్రెజిల్ లో జరిగింది. విమానం కుప్పకూలడంతో అందులో ఉన్న 8 మంది సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు.

బ్రెజిల్ కు చెందిన 8 మంది లోండ్రినా ప్రాంతంలో జరుగుతున్న పెళ్లికి ఫైపర్ నవాజో జెట్ విమానంలో వెళ్లారు. శుభకార్యాం ముగించుకుని ఆదివారం రాత్రి తిరిగి జెట్ విమానంలో గమ్యస్థానానికి బయలుదేరారు.

At least eight persons were killed when an executive jet crash

మార్గం మధ్యలో పరానా రాష్ట్రంలోని క్యాంబే ప్రాంతంలో ఉన్న ఎక్సలెన్స్ రవాణ శాఖ భవనం మీద విమానం కుప్పకూలిపోయింది. విమానంలో మంటలు చెలరేగడంతో అందులో ప్రయాణిస్తున్న 8 మంది అక్కడికక్కడే మరణించారు.

విమానం కుప్పకూలిన ప్రాంతానికి కొద్ది దూరంలో ఓ చర్చి ఉంది. ఆ సమయంలో చర్చిలో 300 మందికి పైగా భక్తులు ప్రార్థనలు చేస్తున్నారు. అయితే చర్చిలో ఉన్న వారికి ఏమీ కాలేదని స్థానికులు చెప్పారు. విమానం కుప్పకూలడానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని, దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The twin-engine Piper Navajo jet crashed onto the facility belonging to the Excellence transportation company Sunday night in Cambe.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X