బిడ్డలను గాలికి వదిలేసి ఐఎస్ లో చేరిన ఆస్ట్రేలియా మహిళ
మెల్ బోర్న్ : ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల చర్యలకు ఆకర్షితురాలైన ఆస్ట్రేలియా మహిళ తన ఇద్దరు బిడ్డలను వదిలి పెట్టి వెళ్లి పోయింది. తాను తీవ్రవాదిని అవుతానని పరోక్షంగా కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లి పోయిందని పోలీసులు గుర్తించారు.
జాస్మినా మిలోవానోవ్ (26) అనే మహిళ టర్కిష్ వెళ్లి పోయిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. జాస్మినా తన ఇద్దరు బిడ్డలను తన సోదరి దగ్గర వదిలి పెట్టింది. ఇదే మన చివరి చూపు, ఇకజీవితంలో నన్ను మీరు చూడలేరని చెప్పింది.

తరువాత జాస్మినా తన మాజీ భర్తకు ఈ విషయం చెప్పింది. తాను ఐఎస్ఐఎస్ తీవ్రవాదిని అవుతానని స్పష్టం చేసింది. చివరికి ఆమె సిడ్నీ విడిచి మాయం అయ్యిందని పోలీసులు అంటున్నారు. తన మాజీ భార్య ఇలా వెళ్లి పోవడం షాక్ కు గురి చేసిందని ఆమె మాజీ భర్త అంటున్నారు.
ఇప్పుడు ఆమె గురించి తాను ఆలోచించడం లేదని, ప్రస్తుతం ఇద్దరు బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాని ఆయన అంటున్నారని పోలీసులు చెప్పారు. జాస్మినా గురించి ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని నిజాలు తెలుస్తున్నాయని పూర్తి వివరాలు సేకరిస్తున్నామని సిడ్నీ పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications