Bangladesh Chief Justice: సుప్రీం ముట్టడి-గంటలో ఛీఫ్ జస్టిస్ రాజీనామా-కారణమిదే..?
బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల మార్పులతో మొదలైన నిరసనల పర్వం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రధాని, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సహా పలువురు మంత్రులు, ప్రముఖుల్ని నిర్బంధించి రాజీనామాలు చేయిస్తున్న ఆందోళనకారులు ఇవాళ అనూహ్యంగా సుప్రీంకోర్టును సైతం ముట్టడించారు. ఛీఫ్ జస్టిస్ సహా జడ్జీలందరినీ గంటలో రాజీనామాలు చేయాలని పట్టుబట్టారు. దీంతో ఛీఫ్ జస్టిస్ రాజీనామా చేసి వెళ్లిపోయారు.
అత్యున్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తి రాజీనామా చేయకుంటే వారి నివాసాలను ముట్టడిస్తామని ఆందోళనకారులు ఇవాళ హెచ్చరించారు. దేశంలో తాత్కాలిక ప్రభుత్వానికి తెలియకుండా సుప్రీంకోర్టులో జడ్డీలతో ఛీఫ్ జస్టిస్ ఏర్పాటు చేసిన భేటీపై నిరసనకారులు భగ్గుమన్నారు. దీంతో సుప్రీంకోర్టును ముట్టడించారు. గంటలో జడ్డీలు రాజీనామాలు చేయాలని అల్టిమేటం ఇచ్చారు. దీంతో భేటీ రద్దు చేసుకోవడమే కాక ఛీఫ్ జస్టిస్ ఒబైదుల్ హసన్ తప్పుకున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ దీన్ని ధృవీకరించారు.

సుప్రీంకోర్టుతో పాటు కిందిస్థాయి కోర్టుల్లో న్యాయమూర్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తాను తప్పుకున్నట్లు ఛీఫ్ జస్టిస్ ఒబైదుల్ హసన్ ఆ తర్వాత మీడియాకు వెల్లడించారు. మాజీ ప్రధాని షేక్ హసీనా నియమించిన ఛీఫ్ జస్టిస్ కావడంతో ఆయన్ను టార్గెట్ చేసి నిరసనకారులు తప్పించినట్లు తెలుస్తోంది. అయితే దేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైనా ఇంకా నిరసనలు, దాడులు కొనసాగుతుండటంతో బంగ్లాదేశ్ పై ఆంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది.












Click it and Unblock the Notifications