Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

US Nitrogen Gas Execution: నైట్రోజన్ గ్యాస్ తో అమెరికాలో మరణశిక్ష-డిఫెన్స్ లోకి వైట్ హౌస్?

ఇప్పటి వరకూ ప్రపంచదేశాల్లో మరణశిక్ష అంటే ఉరి వేయడం ద్వారానో లేక నరికివేత తరహాలోనో, లేక ఇంజెక్షన్ ఇచ్చి చంపడమో జరిగాయి. కానీ ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికాలో తాజాగా ఓ 58 ఏళ్ల హంతకుడికి నెట్రోజన్ గ్యాస్ ద్వారా మరణశిక్ష విధించారు. దీనిపై ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. ఐరాస, ఐరోపా సమాఖ్య సహా పలు సంస్ధలు, ప్రముఖులు ఈ తరహా మరణశిక్ష అమలు అనాగరికం అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

అమెరికాలోని దక్షిణాది రాష్ట్రమైన అలబామాలో నిన్న కెన్నెత్ స్మిత్ అనే 58 ఏళ్ల హంతకుడిని దోషిగా నిర్ధారించి మరణశిక్ష అమలు చేశారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికాలో ప్రయోగాత్మకంగా స్మిత్ కు మాస్క్ తగిలించి అందులో నైట్రోజన్ గ్యాస్ పంపడం ద్వారా అతన్ని అపస్మారక స్ధితిలోకి తీసుకెళ్లి ఈ మరణశిక్షను విజయవంతంగా అమలు చేశారు. అంతే కాదు ఈ మరణశిక్ష అమలును వీక్షించేందుకు అతని, బాధిత కుటుంబ సభ్యులు, లాయర్లను కూడా పరిమిత సంఖ్యలో అనుమతించారు.

biden regime in defense over first nitrogen gas execution, what white house statement says?

చాలా సులువుగా కేవలం 22 నిమిషాల వ్యవధిలో కెన్నెత్ స్మిత్ నైట్రోజన్ గ్యాస్ మరణశిక్షతో ప్రాణాలు కోల్పోయాడు. కానీ ఇప్పుడు దీన్ని అమలు చేసిన అమెరికా మాత్రం ప్రపంచం దృష్టిలో దోషిగా నిలబడింది. స్వదేశంలో దీనిపై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఐక్యరాజ్యసమితితో పాటు ఐరోపా దేశాల సమాఖ్య ఈయూ కూడా అమెరికా తీరును ఖండించాయి. ఈ ఖండనలు, నిరసనలు ఏ స్ధాయిలో ఉన్నాయంటే స్వయంగా వైట్ హౌస్ ఈ నైట్రోజన్ గ్యాస్ మరణశిక్ష తమను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందని, ఇది క్రూరంగానే ఉందని అంగీకరించింది.

అమెరికాలో తాజాగా రెండు మరణశిక్షలు ఇంజెక్షన్ ద్వారా అమలు చేశారు. కానీ ప్రస్తుతం నైట్రోజన్ మరణశిక్షను అమలు చేసిన అలబామాతో పాటు మరో రెండు రాష్ట్రాలు ఓక్లహోమా, మిస్సిసిపీ మాత్రం ఈ తరహా విధానాన్ని ఆమోదించాయి. తాజాగా జరిగిన నైట్రోజన్ మరణశిక్ష అమలును అలబామా అటార్నీ జనరల్ స్టీవ్ మార్షల్ సమర్ధించుకున్నారు. ఇది పూర్తిగా ప్రొఫెషనల్ పద్ధతిలో జరిగిందన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+