భారత్ కు బిగ్ రిలీఫ్-8 మంది నేవీ మాజీల మరణశిక్షపై ఖతార్ కోర్టు కీలక తీర్పు..!

ఇజ్రాయెల్ కు గూఢచర్యం చేస్తూ దొరికిపోయిన 8 మంది నేవీ మాజీ అధికారుల వ్యవహారంలో ఖతార్ కోర్టు నుంచి గుడ్ న్యూస్ అందింది. భారత్ ఒత్తిడితో ఖతార్ కోర్టు వీరికి విధించిన మరణశిక్ష విషయంలో మార్పులు చేస్తూ కీలక తీర్పు ఇచ్చింది. ఈ విషయాన్ని విదేశాంగశాఖ అధికారులు ఇవాళ వెల్లడించారు. గతంలో ఖతార్ స్ధానిక కోర్టు ఈ 8 మంది నేవీ మాజీలకు విధించిన మరణశిక్షపై భారత్ అప్పీలు చేయడంతో ఉన్నత న్యాయస్ధానంలో ఊరట లభించింది.

ఎనిమిది మంది భారత నౌకాదళ మాజీ అధికారుల మరణశిక్షను జైలు శిక్షగా మార్చుతూ ఖతార్‌లోని అప్పీల్ కోర్టు నిన్న తీర్పు వెలువరించింది. ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఇవాళ స్వాగతించింది. జలాంతర్గామిలో గూఢచర్యం, విధ్వంసానికి సంబంధించిన ఆరోపణలతో కూడిన ఈ సంక్లిష్ట న్యాయ వివాదం దహ్రా గ్లోబల్ కేసులో ఎనిమిది మంది భారతీయులను గతేడాది అరెస్టు చేశారు. అయితే ఈ విషయాన్ని కేంద్రం గోప్యంగా ఉంచింది. చివరకు మరణశిక్ష అమలు గడువు దగ్గరపడటంతో ఇది బయటికి వచ్చింది.

big relief to india as qatar court commuted 8 navy officials death sentence to imprisonment

దీనిపై భారత్ చేసిన అప్పీలు, ఖతార్ తో ఉన్న దౌత్య సంబంధాల దృష్ట్యా ఖతార్ కోర్టు ఈ సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అప్పీల్ కోర్టు వివరణాత్మక తీర్పు ఇంకా విడుదల కాలేదని, తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోవడానికి న్యాయ బృందం, నిందితుల కుటుంబ సభ్యులతో టచ్ లో ఉన్నట్లు విదేశాంగశాఖ వెల్లడించింది. ఖతార్‌లోని మన రాయబారి, ఇతర అధికారులు కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ అప్పీల్ కోర్టుకు హాజరయ్యారని తెలిపింది.

ఖతార్ అధికారులతో నిరంతరం టచ్ లో ఉంటూ భారతీయులకు న్యాయ సహాయం అందిస్తామని విదేశాంగశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే కేసు విచారణలో గోప్యత, సున్నితమైన స్వభావం ఉన్నందున, ఇంతకు మించి మాట్లాడటం సరికాదని తెలిపింది. మరోవైపు ఖతార్ లో నేవీ అధికారులపై నమోదైన దహ్రా గ్లోబల్ కేసు ఏళ్ల తరబడి కొనసాగుతూ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఖతార్ కంపెనీలో పనిచేస్తున్న ఎనిమిది మంది భారతీయ పౌరులకు ఖతార్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. దీన్ని అప్పీలు కోర్టు నిన్న జైలుశిక్షగా మార్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+