Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్ల జైలుశిక్ష, భార్యకు ఏడేళ్లు..!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఇవాళ మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని పదవి కోల్పోయాక ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అవినీతి కేసుల్లో ఆయన పాత్రపై ఇప్పటికే పలు కేసులు నమోదు కావడం, ఆయన జైలు పాలవ్వడం జరిగిపోయాయి. ఇందులో కీలకమైన అల్ ఖదీర్ ట్రస్టు అవినీతి కేసులో ఇవాళ పాకిస్తాన్ కోర్టు ఆయనకు ఏకంగా 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆయన అవినీతిలో భాగమైన ఆయన భార్య బుష్రా బీబీకి ఏడేళ్ల శిక్ష విధించింది.
అల్-ఖదీర్ ట్రస్ట్ పేరుతో ఇమ్రాన్ దంపతులు స్థాపించిన ట్రస్టు అవినీతి విషయంలో అవినీతి నిరోధక కోర్టు ఈ శిక్ష విధించింది.
ఇమ్రాన్ ఖాన్ పై ఇప్పటికే దాదాపు 200 కేసుల్లో అభియోగాలు నమోదయ్యాయి. 2023 నుంచి ఆయన పోలీసు కస్టడీలోనే ఉన్నారు. ఇవాళ జైలుశిక్ష తర్వాత తాను ఎలాంటి ఒప్పందం చేసుకోనని, ఎలాంటి ఉపశమనం పొందనని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు.ఈ మధ్య బెయిల్ పై విడుదలైన ఇమ్రాన్ భార్య బుష్రా బీబీని కోర్టు తీర్పు తర్వాత అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు ఆయన పార్టీ పీటీఐ.. ఇమ్రాన్ ఖాన్ పై కేసులు రాజకీయ ప్రేరేపితమని, ఆయన జైలు నుంచి బయటికి రాకుండా వీటిని మోపుతున్నారని ఆరోపిస్తోంది. రాజకీయాల నుండి వైదొలగడానికి సైన్యంతో ఒప్పందాన్ని అంగీకరించేలా ఇమ్రాన్ ఖాన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ఈ జైలు శిక్ష విధించి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. 2022లో అధికారం నుండి తప్పుకున్నాక ఇమ్రాన్ ఖాన్ తిరిగి ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో ఆర్మీని పూర్తిగా టార్గెట్ చేశారు. ఖాన్‌కు ఇప్పటికే విధించిన నాలుగు శిక్షల్లో రెండు రద్దు అయ్యాయి. అయితే మిగిలిన రెండు కేసులలో శిక్షలు తాత్కాలికంగా నిలిపేశారు. అయినా పెండింగ్‌లో ఉన్న కేసుల కారణంగా ఇమ్రాన్ ఇంకా జైలులోనే ఉన్నారు.












Click it and Unblock the Notifications