పహల్గాం ఉగ్రదాడి సూత్రధారిని అప్పగిస్తాం.. కానీ.. పాకిస్థాన్ సంచలన డిమాండ్..!

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో అనేకమంది ఉగ్రవాదులు హతం అయినట్లు భారత రక్షణశాఖ పేర్కొంది. కేవలం దాడులే కాకుండా పాకిస్థాన్ పై పలు ఆంక్షలు విధించింది భారత్. ముఖ్యంగా సింధూ నదీ జలాల పంపిణీ రద్దు, దిగుమతులు ఎగుమతులపై నిషేధం, గగనతలం మూసివేత తదితర కఠిన నిర్ణయాలతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై దెబ్బ కొట్టింది.

అయితే పాకిస్థాన్ మాత్రం మళ్లీ పాత ధోరణిలోనే వ్యవహరిస్తోంది. చైనా, టర్కీ లాంటి దేశాల నుంచి ఆయుధాలు భారీగా సమకూర్చుకుంటోంది. ఈ క్రమంలో భారత్ మరోసారి అలర్ట్ అయింది. అయితే తాజాగా పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులను అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కానీ భారత్ తమకు సహకరించాలని అన్నారు. గుడ్ విల్ కింద ఉగ్రవాదులను అప్పగిస్తామన్నారు.

నరహంతకులుగా పేరు పొందిన హఫీజ్ సయీద్, మసూద్ అజార్ లను పాకిస్థాన్ భారత్ కు అప్పగించేందుకు సిద్దంగా ఉందని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధినేత, మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే మసూద్ అజార్ ప్రస్తుతం అఫ్గానిస్తాన్ లో ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఇక హఫీజ్ సయీద్ ప్రస్తుతం పాకిస్థాన్ కస్టడీలోనే ఉన్నాడని ఆయన బయట స్వేచ్ఛగా తిరుగుతున్నాడన్న వార్తలు అవాస్తవమని తెలిపారు. ప్రముఖ వార్తా సంస్థ అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Bilawal Bhutto Pakistan Open to Extraditing Hafiz Saeed Masood Azhar to India

"భారత్ ఉగ్రావాదులుగా భావిస్తున్న హఫీజ్ సయీద్, మసూద్ అజార్ లను అప్పగించేందుకు తమకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇరు దేశాల మధ్య దౌత్య పరమైన చర్చల ద్వారానే ఇది సాధ్యం. ఇందుకు భారత్.. పాకిస్థాన్ కు సహకరించాలి. టెర్రరిజంపైనా చర్చలు జరుపుదాం" అని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధినేత, మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో కీలక వ్యాఖ్యలు చేశారు.

26/11 ముంబై ఉగ్రదాడులతో పాటు అనేక ఉగ్రదాడుల్లో హఫీజ్‌ సయీద్‌ కీలక సూత్రధారిగా ఉన్నాడు. భారత్‌లో మోస్ట్ వాంటెడ్‌ ఉగ్రవాదుల్లో ఒకడిగా హఫీజ్ సయీద్‌ ఉన్నాడు. సయీద్‌ను.. ఐక్యరాజ్య సమితి కూడా అంతర్జాతీయ ఉగ్రవాదిగా గతంలోనే ప్రకటించింది. అతడి తలపై అమెరికా 10 మిలియన్‌ డాలర్ల రివార్డ్‌ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పహల్గాం ఉగ్రదాడికి సూత్రధారి, ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ కు పాకిస్థాన్ ప్రభుత్వం ఫుల్ సెక్యూరిటీ అందిస్తున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+