5.4కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం.. షాకింగ్ పని చేసిన వైద్యుడు
చాలామంది తమ పేరు మీద ఇన్సూరెన్స్ చేసి, అడ్డదారిలో డబ్బులు సంపాదించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల పేరు మీద ఇన్సూరెన్స్ పాలసీలు చేయడం, ఆ తర్వాత వారిని హతమార్చి, దానిని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం చేస్తారు. ఈతరం మోసాలకు పాల్పడుతున్న వారు అనేకమంది గతంలో పట్టుబడ్డారు.
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం డాక్టర్ దారుణం
ఇక తాజాగా ఒక వైద్యుడు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఏకంగా తన రెండు మోకాళ్లను తొలగించుకున్న ఘటన అందరిని షాక్ కి గురి చేసింది. బ్రిటన్ లో ఒక వైద్యుడు చేసిన ఈ షాకింగ్ పని విషయానికి వస్తే... బ్రిటన్ లో ఒక వైద్యుడు ఏకంగా ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తన రెండు కాళ్ళను తొలగించుకున్నారు. ఐదులక్షల పౌండ్లు వస్తుందన్న ఆశతో అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం మోకాళ్లను తొలగించుకున్న డాక్టర్
సుమారు 5.4 కోట్ల రూపాయల కోసం నెయిల్ హాపర్ అనే డాక్టర్ రెండు మోకాళ్లను తొలగించుకుని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి ప్రయత్నించారు. అయితే ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి వ్యతిరేకించి నెయిల్ హాపర్ ఉద్దేశపూర్వకంగానే తన మోకాళ్లను తొలగించుకున్నారని, ఇన్సూరెన్స్ సంస్థలను మోసం చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఆపై ఇన్సూరెన్స్ కంపెనీలు డాక్టర్ పైన కోర్టుకు వెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం కోర్టు ఈ కేసును విచారిస్తోంది.
మరో డాక్టర్ సాయంతో మోకాళ్ళ తొలగింపు
అయితే ఈ కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది . మ్యారియస్ గుత్సావ్ సన్ అనే వైద్యుడు ఇతరుల కాళ్ళను తొలగించేలా నెయిల్ ను ప్రోత్సహించాడని అభియోగాలు వచ్చాయి. ఇక నెయిల్ తన మోకాళ్లను తొలగించుకోవడానికి ఒక వెబ్సైట్ నుంచి కొన్ని వీడియోలను కొనుగోలు చేసి వాటిని స్టడీ చేసి తొలగించుకున్నారు అని ఇన్సూరెన్స్ కంపెనీ ఆరోపిస్తోంది.
కోర్టు మెట్లెక్కిన ఇన్సూరెన్స్ కంపెనీలు
రెండు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఈ విధమైన చర్యలతో క్లెయిమ్ దరఖాస్తు చేసినట్టు పేర్కొన్నారు. అయితే అతను మాత్రం తనకు రక్తనాళాల సంబంధిత సమస్య ఉందని, మోకాళ్ళని తొలగించకపోతే అది శరీరం అంతా వ్యాపిస్తుందని ఆయన చెప్తున్నారు. కానీ అదంతా అబద్ధమని, ఇది కేవలం ఇన్సూరెన్స్ కోసం చేస్తున్న మోసమని ఇన్సూరెన్స్ కంపెనీలు వాదిస్తున్నారు.
కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఇద్దరు డాక్టర్లు
అయితే తను ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు కాళ్లు తొలగించాలని ఇన్సూరెన్స్ కంపెనీలకు ముందే సమాచారం ఇవ్వలేదని ఆ కంపెనీలు క్లెయిమ్ ఇవ్వడానికి నిరాకరించాయి.మరియస్ గుత్సావ్‌సన్‌తో నెయిల్‌కు ఉన్న సంబంధం బయటపడటంతో పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలోనే రాయల్ కార్నివాల్ ఆస్పత్రి యాజమాన్యం మార్చి 2023లో గుత్సావ్‌సన్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. ప్రస్తుతం వారిద్దరూ ఈ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications