వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో.. బ్రిటీష్ మంత్రికి కరోనా పాజిటివ్, గతవారం ప్రధాని బోరిస్ జాన్సన్‌తో భేటీ..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ఖండంతరాలు దాటి విస్తరిస్తోంది. వైరస్ సోకి ప్రపంచవ్యాప్తంగా 4 వేల మందికిపైగా చనిపోగా.. 90 వేల పైచిలుకు మందికి పాజిటివ్ సోకింది. అయితే బ్రిటన్ వైద్యారోగ్య జూనియర్ మంత్రి నాడిన్ డోరీస్‌కు కరోనా పాజిటివ్ వైరస్ వచ్చిందనే విషయం కలవరానికి గురిచేసింది. సాక్షాత్తూ వైద్యారోగ్యశాఖ మంత్రికి వైరస్ సోకడంతో ప్రజలు ఆందోళనకు గురువుతున్నారు.

Recommended Video

3 Minutes 10 Headlines | Coronavirus Outbreak | Amrutha Pranay Father Maruthi Rao | Oneindia

తనకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని డోరిస్ తెలిపారు. వైద్యుల సూచన మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నానని.. తన ఇంటిలోనే ఐసోలేషన్ వార్డులో ఉన్నట్టు పేర్కొన్నారు. ఇంగ్లాండ్ ఆరోగ్య, తన పార్లమెంటరీ కార్యాలయ సిబ్బంది సలహాతో నడుచుకుంటున్నానని ప్రకటనలో డోరీస్ పేర్కొన్నారు.

 British health minister tests positive for coronavirus..

డోరీస్‌కు కరోనా వైరస్ సోకిందని మంగళవారం నిర్ధారణ కాగా.. ఆమె అంతకుముందే పార్లమెంట్ సమావేశంలో వేలాదిమంది ప్రజలను కలుసుకొన్నారని 'టైమ్స్' రిపోర్ట్ చేసింది. అంతేకాదు గతవారం జరిగిన ఒక విందులో ప్రధాని బోరిస్ జాన్సన్‌తో కూడా సమావేశమయ్యారు. దీంతో ప్రజలు, ప్రధానికి కూడా వైరస్ సోకిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

డోరిస్‌కు కరోనా పాజిటివ్ సోకడం బాధాకరమని వైద్యారోగ్యశాఖ మంత్రి మాట్ హన్‌కాక్ ట్వీట్ చేశారు. వైరస్ సోకిన వెంటనే తాను సెల్ఫ్ ఐసోలేటెడ్ వార్డులో ఇంటిలో ఉండటం మంచి చర్య అని అభివర్ణించారు. బ్రిటన్‌లో కరోనా వైరస్ సోకి మృతిచెందిన వారి సంఖ్య ఆరుకు చేరింది. అదేవిధంగా కరోనా వైరస్ పాజిటివ్ సంఖ్య 319 నుంచి 373కి చేరిందని వివరించింది.

English summary
British junior health minister Nadine Dorries has tested positive for coronavirus and is self-isolating, she said on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X