పూజా హెగ్డే గెస్ కరెక్ట్ అయింది.. విజయ్ సీఎం అయ్యాడు..!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ టీవీకే పార్టీ రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను 108 స్థానాల్లో విజయ్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. మ్యాజిక్ ఫిగర్ కు కేవలం 10 సీట్లు మాత్రమే కావాల్సి ఉంది. దాంతో విజయ్ కు మద్దతుగా నిలిచేందుకు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం వంటి ఇతర పార్టీలు ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజయ్ సిద్ధమవుతున్నారు. అయితే విజయ్ తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధిస్తారని ముందే చాలా మంది అంచనా వేసినట్లు స్పష్టం అవుతోంది.
ఇక స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే సైతం విజయ్ విజయాన్ని ముందుగానే గెస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. విజయ్- పూజా హెగ్డే కలిసి జన నాయగన్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.
Pooja on insta 😎💥 Who WINS the Elections? 🤩 pic.twitter.com/3Lpt4CAIbo
— Harish N S (@Harish_NS149) May 5, 2026
అయితే జన నాయగన్ చిత్రం షూటింగ్ సమయంలో పూజా హెగ్డే, విజయ్ ల మధ్య జరిగిన ఓ ఫన్నీ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పూజా హెగ్డే ఓ బోర్డుపై ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..? అనే ప్రశ్నకు విజయ్ ను చూపిస్తుంది. అప్పుడు విజయ్ నవ్వుతూ కనిపిస్తారు. అలా పూజా హెగ్డే, విజయ్ లు నవ్వుతూ కనిపిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇక జన నాయగన్ చిత్రం ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉండగా సెన్సార్ బృందం ఈ మూవీకి సర్టిఫికెట్ ఇవ్వలేదు. దాంతో ఈ మూవీ నిరవధికంగా వాయిదా పడింది. ఈ మూవీని హెచ్. వినోద్ తెరకెక్కించారు. విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అలాగే మలయాళం బ్యూటీ మమితా బైజు, బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ మూవీకి సంగీతం అందించారు.












Click it and Unblock the Notifications