అంటార్కిటికాలో.. గడ్డ కట్టే చలిలో.. ఒక్కటైన జంట!
బ్రిటిష్ అంటార్కిటికా పరిశోధనా కేంద్రంలో పనిచేసే జూలీ బామ్, టామ్ సిల్వస్టర్‌లు గడ్డకట్టే చలి సాక్షిగా ఒక్కటయ్యారు. అంటార్కిటికా ప్రాంతంలో జరిగిన మొదటి అధికారిక పెళ్లి వీరిదే.
లండన్: బ్రిటిష్ అంటార్కిటికా పరిశోధనా కేంద్రంలో పనిచేసే జూలీ బామ్, టామ్ సిల్వస్టర్‌లు గడ్డకట్టే చలి సాక్షిగా ఒక్కటయ్యారు. అంటార్కిటికా ప్రాంతంలో జరిగిన మొదటి అధికారిక పెళ్లి వీరిదే.
ఈ పెళ్లికి వారితో పాటు పనిచేసే 18 మంది సహోద్యోగులు అతిథులుగా హాజరయ్యారు. గత పదేళ్లుగా పోలార్ ఫీల్డ్ గైడ్స్‌గా పని చేస్తున్న జూలీ బామ్, టామ్ సిల్వస్టర్‌లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

మా ప్రేమ అంటార్కిటికా మంచు సాక్షిగా పుట్టింది. అందుకే మా పెళ్లికి ఇంతకంటే మంచి ప్రదేశం ప్రపంచంలో ఎక్కడా దొరకదనుకున్నాం అంటూ పెళ్లికూతురు జూలీ బామ్ చెప్పింది.
So excited to share pics from #wedding of Julie & Tom in #Antarctica, the first in the British Antarctic Territoryhttps://t.co/ejjS8s3m0Q pic.twitter.com/frNNm6DJw6
— Antarctic Survey (@BAS_News) July 17, 2017
వీరద్దరూ కలిసి ప్రపంచంలోని అన్ని దేశాల్లో గల మంచు పర్వతాల మీద పరిశోధన చేశారు. ఇప్పుడు అదే మంచు సాక్షిగా ఒక్కటయ్యారు. మరి వీరి కాపురం కూడా పది కాలాల పాటు చల్లగా సాగిపోవాలని ఆశిద్దాం!












Click it and Unblock the Notifications