సెంట్రల్ మార్కెట్‌పై ఆత్మాహుతి: 32మంది మృతి
బీరుట్: కెమరూన్ దేశంలో సోమవారం పలుచోట్ల బోకోహరమ్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహతిదాడుల్లో 32 మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. దేశ ఉత్తర ప్రాంతంలోని గ్రామంలో బోడో సెంట్రల్ మార్కెట్‌లో సోమారం రెండు చోట్ల ఆత్మాహుతి దాడులు జరిగాయి. మరో రెండు చోట్ల కూడా ఆత్మాహుతి దాడులు జరిగాయి.

సిరియాలో దాడులు
సిరియాలోని అలెప్పో పట్టణంలో ఒక ఆత్మాహుతి దళ సభ్యుడు బాంబులతో నిండిన ట్రక్కుతో విధ్వంసానికి పాల్పడ్డాడు. ఫలితంగా 23 మంది చనిపోయారు.
అలస్కాలో భూకంపం
అమెరికాలోని అలస్కా భూకంపం తాకిడికి వణికిపోయింది. సోమవారం ఈ రాష్ట్రంలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.1గా నమోదైనట్టు భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు.












Click it and Unblock the Notifications