భారత్ కు వ్యతిరేకంగా మద్దతు కూడగడుతున్న కెనడా ? ట్రూడో తాజా ఫోన్ కాల్..
జీ20 సదస్సు సక్సెస్ తర్వాత అంతర్జాతీయంగా గ్రాఫ్ పెంచుకున్న భారత్ కు ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ వ్యవహారం తలనొప్పిగా మారింది. హర్దీప్ సింగ్ నిజ్జార్ ను కెనడాలో హత్య చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న జస్టిన్ ట్రూడో ప్రభుత్వం.. ఇప్పటికే ఈ వ్యవహారంలో తమ మిత్రదేశాల సాయం కోరింది. భారత్ పై ఒత్తిడి పెంచాలంటూ వారిని కెనడా కోరుతోంది. ఇప్పుడు మిత్రదేశాలతో పాటు ఇతర దేశాలను కూడా కెనడా సాయం కోరడం మొదలుపెట్టింది.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా యూఏఈ అధ్యక్షుడికి ఫోన్ చేసి భారత్ గురించి మాట్లాడారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో ట్రూడో.. భారత్ వివాదంపై మాట్లాడారు. ఇద్దరు నేతలు కెనడా-భారత్ మధ్య కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించడమే కాకుండా ఇజ్రాయెల్‌లో పౌర రక్షణ గురించి పరస్పరం ఆందోళనలు వ్యక్తం చేసుకున్నారు.

కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారతదేశం, కెనడా మధ్య దౌత్య సంబంధాలు ఇప్పటికే దిగజారాయి. ఇప్పటికే వరుసగా దౌత్య వేత్తల ఉపసంహరణను కొనసాగిస్తున్న ఇరుదేశాలు.. తప్పు మాది కాదంటే మాది కాదంటూ వాదిస్తున్నాయి. ఈ క్రమంలో హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యను చట్టప్రకారం విచారణ జరిపి నిందితుల్ని శిక్షించాలని కెనడా ఒత్తిడి పెంచుతోంది. ఇందుకోసం పలు అంతర్జాతీయ నేతల్ని తాజాగా కెనడా ప్రధాని సంప్రదిస్తున్నారు.
ఈరోజు ఫోన్‌లో, హిస్ హైనెస్ @MohamedBinZayed, తాను ఇజ్రాయెల్‌లో ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఎక్స్ లో పేర్కొన్నారు. తాము దీనిపై లోతైన ఆందోళనను వ్యక్తం చేశామని, పౌర జీవితాన్ని రక్షించాల్సిన అవసరం గురించి చర్చించామన్నారు. అలాగే భారతదేశం గురించి, చట్టబద్ధమైన పాలనను సమర్ధించాల్సిన అవసరం గురించి కూడా మాట్లాడుకున్నట్లు ట్వీట్ లో తెలిపారు.
-
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం బంపరాఫర్ - తాజా గడువు, మార్గదర్శకాలు..!! -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్











Click it and Unblock the Notifications