వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

థర్డ్‌వేవ్ బిగిన్స్: కెనడాలో ఒమిక్రాన్ వ్యాప్తి: నైజీరియా వెళ్లొచ్చిన వారికి పాజిటివ్: లాక్‌డౌన్

|
Google Oneindia TeluguNews

ఒట్టావా: రెండు సంవత్సరాలుగా ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచ దేశాలు సహవాసం చేస్తోన్నాయి. ఇప్పుడిప్పుడే కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సుదీర్ఘకాలం పాటు లాక్‌డౌన్‌లో గడిపిన అనేక దేశాల్లో జనజీవనం గాడిన పడుతోంది. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు క్రమంగా పట్టాలెక్కుతున్నాయి. కరోనా వైరస్‌కు చెందిన డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లు వెలుగులోకి వచ్చినప్పటికీ.. పెద్దగా భయపడాల్సిన అవసరం లేకుండా పోయింది. వాటిని అదుపు చేయగలిగాయి ప్రపంచ దేశాలన్నీ.

ఎంత ముందుజాగ్రత్త తీసుకున్నా..

ఎంత ముందుజాగ్రత్త తీసుకున్నా..

ఇప్పుడు కొత్తగా దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ మాత్రం మరోసారి కల్లోలాన్ని మిగిల్చేలా కనిపిస్తోంది. కరోనా వైరస్ తరహా పరిస్థితులు మళ్లీ అన్ని దేశాల్లో కూడా తలెత్తే ప్రమాదం లేకపోలేదనిపించేలా చేస్తోంది. భారత్ కూడా దీనికి మినహాయింపు కాకపోవచ్చు. ఇప్పటికే యునైటెడ్ కింగ్‌డమ్ సహా యూరోపియన్ యూనియన్‌లోని అనేక దేశాలు, ఇజ్రాయెల్ వంటివి.. ఆఫ్రికన్ కంట్రీస్‌తో తమ వాయు సంబంధాలను తెంచుకున్నాయి. విమాన సర్వీసులను రద్దు చేసుకున్నాయి.

కెనడాలో ఒమిక్రాన్ వేరియంట్..

కెనడాలో ఒమిక్రాన్ వేరియంట్..

ఈ పరిణామాల మధ్య కెనడాలో ఈ ఒమిక్రాన్ వేరియంట్ అడుగు పెట్టింది. ఇద్దరు కెనడియన్లు ఈ వైరస్ బారిన పడ్డారు. ఇటీవలే నైజీరియా పర్యటనకు వెళ్లొచ్చారు వారిద్దరు. అనంతరం అనారోగ్యానికి గురయ్యారు. వారికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. వారి నమూనాలను సేకరించి కరోనా వైరస్ జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపించారు. అది ఒమిక్రాన్ వేరియంట్‌గా తేలింది. ఒట్టావాకు చెందిన వారిద్దరూ ప్రస్తుతం ఐసొలేషన్‌లో ఉన్నారు.

కాంటాక్టుల ట్రేసింగ్..

కాంటాక్టుల ట్రేసింగ్..

ఈ విషయం తెలిసిన వెంటనే ఒట్టావా పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులు అప్రమత్తం అయ్యారు. వారి కాంటాక్టులను ట్రేస్ చేస్తోన్నారు. ఆఫ్రికాకు విమాన సర్వీసులను నిలిపివేసిన దేశాల్లో కెనడా కూడా ఒకటి. ఈ నిషేధానికి రెండు రోజుల ముందే వారు నైజీరియా నుంచి స్వదేశానికి చేరుకున్నట్లు ఒంటారియో ప్రావిన్స్ అధికారులు తెలిపారు. వారిద్దరూ ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడిన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఒమిక్రాన్ వైరస్ తమ దేశంలో వెలుగులోకి రావడం ఇదే తొలిసారిగా పేర్కొన్నారు.

లాక్‌డౌన్ ప్రతిపాదనలను పరిశీలిస్తోన్నాం: మంత్రి డక్లోస్..

లాక్‌డౌన్ ప్రతిపాదనలను పరిశీలిస్తోన్నాం: మంత్రి డక్లోస్..

ఒమిక్రాన్ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఈ రెండింటితో ఆగకపోవచ్చని కెనడా వైద్య శాఖ మంత్రి జీన్-యేవ్స్ డక్లోస్ అభిప్రాయపడ్డారు. కేసులు మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగులోకి వచ్చిన ఒంటారియో ప్రావిన్స్‌లో లాక్‌డౌన్‌ను ప్రకటించే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు. రోజువారీ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను రెట్టింపు చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ వైరస్ మిగిలిన ప్రావిన్స్‌లకు విస్తరించకుండా అన్ని రకాల చర్యలను యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటున్నట్లు మంత్రి డక్లోస్ చెప్పారు.

Recommended Video

Omicron : PM Modi High Level Review On New Variant || Oneindia Telugu
థర్డ్‌వేవ్ ఆరంభమైనట్టేనా..

థర్డ్‌వేవ్ ఆరంభమైనట్టేనా..

కెనడాలో ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందడం మొదలైందనే భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. థర్డ్ వేవ్ ముప్పునకు ఇది ఆరంభమైందని నిపుణులు అంచనా వేస్తోన్నారు. ఒమిక్రాన్ వేరియంట్.. తన పరిధిని విస్తరించుకున్నట్టయింది. ఆఫ్రికా ఖండాన్ని దాటి బయటి దేశాలకు విస్తరించడం మొదలు పెట్టింది. నైజీరియాకు వెళ్లొచ్చిన ఆ ఇద్దరు కెనడియన్ల ద్వారా మరింత మందికి ఈ వైరస్ సోకి ఉండొచ్చనే అనుమానాలు ఒంటారియో ప్రావిన్స్ అధికారులు నెలకొన్నాయి. త్వరలోనే ఈ ప్రావిన్స్‌లో సంపూర్ణ లాక్‌డౌన్ విధించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.

English summary
Canada said Sunday it has detected its first cases of the new Omicron strain of Covid, in two people who had traveled recently to Nigeria.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X