యూఎస్ లోని హెచ్1బీ వీసా హోల్డర్లకు కెనడా గుడ్ న్యూస్!!
అమెరికాలో ఉంటున్న హెచ్ వన్ బీ వీసా హోల్డర్లకు కెనడా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అమెరికాలో హెచ్ వన్ బీ వీసా హోల్డర్లు తమ కుటుంబ సభ్యులతో పాటు కెనడాకి వచ్చి పని చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు తాజాగా ప్రకటన చేసింది. వర్క్ పర్మిట్ కూడా ఉచితంగా ఇస్తామని, హెచ్ వన్ బీ వీసా హోల్డర్ల తో పాటు వచ్చే కుటుంబ సభ్యులకు పలు మినహాయింపు ఇస్తామని ప్రకటించింది.
అమెరికాలో ఉద్యోగం సంపాదించిన వారికి ఇచ్చే వీసా హెచ్ వన్ బీ వీసా. ఈ వీసా హోల్డర్లు తమ కుటుంబ సభ్యులను డిపెండెంట్ వీసా పై అమెరికాకు తీసుకొని వెళ్ళవచ్చు. అయితే డిపెండెంట్ వీసా మీద అమెరికా కి వెళ్ళిన కుటుంబ సభ్యులు చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా మళ్లీ ప్రత్యేకమైన అనుమతి తీసుకోవాలి.

ఇది కాస్త ఖర్చుతో, రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఈ క్రమంలోనే హెచ్ వన్ బీ వీసా హోల్డర్లకు, వారి కుటుంబ సభ్యులకు ఫ్రీ గా కెనడాలో కి ఎంట్రీ ఇవ్వడానికి, వారు చదువుకోవటానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి కెనడా ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తుంది. దేశంలో ఎక్కడైనా ఏ కంపెనీ లోనైనా పని చేసుకునేందుకు అనుమతిస్తామని పేర్కొంది.
హెచ్ వన్ బీ వీసా హోల్డర్ల కుటుంబ సభ్యులు తమ దేశంలో చదువుకోవచ్చని, పని చేసుకోవచ్చని కూడా కెనడా ఇమ్మిగ్రేషన్ వ్యవహారాల మంత్రి సియాన్ ఫ్రేజర్ వెల్లడించారు. అయితే ఈ అవకాశం కేవలం 10 వేల మందికి మాత్రమే నని, ముందుగా ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.
తమ దేశంలో అడుగుపెట్టి హెచ్ వన్ బీ వీసా హోల్డర్లకు మూడేళ్లపాటు తాత్కాలిక నివాసం హోదా కల్పిస్తామని కూడా మంత్రి వెల్లడించారు. మరి నిజంగా ఇది యూఎస్ లో ఉన్న హెచ్ 1 బీ వీసా హోల్డర్లకు శుభవార్తే అని చెప్పాలి. వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం చేసుకునేందుకు కెనడా ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్ తో లబ్ది జరుగుతుంది.












Click it and Unblock the Notifications